Justice N.V. Ramana: క‌శ్మీర్‌లో భారత ప్ర‌ధాన న్యాయ‌మూర్తి, కేంద్ర న్యాయ శాఖ మంత్రి

justce nv rama and union minister kiren rijiju laid foundation for new Building Complex for High Court of Jammu Kashmir and Ladakh at Srinagar
  • క‌శ్మీర్ ప‌ర్య‌ట‌న‌లో జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ, కిర‌ణ్ రిజిజు
  • జ‌మ్మూక‌శ్మీర్‌, ల‌ఢ‌క్ హైకోర్టు నూత‌న భ‌వ‌నానికి భూమి పూజ‌
  • జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణతో క‌లిసి దిగిన ఫొటోల‌ను షేర్ చేసిన రిజిజు
భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట‌ర‌మ‌ణ, కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు ఆదివారం జ‌మ్మూకశ్మీర్‌లో ప‌ర్య‌టించారు. శ్రీన‌గ‌ర్‌లో జ‌మ్మూ క‌శ్మీర్‌, ల‌ఢ‌క్ హైకోర్టు కోసం నిర్మించ‌నున్న నూత‌న భ‌వ‌న స‌ముదాయానికి భూమి పూజ చేసేందుకు వ‌చ్చిన వీరిద్ద‌రూ కార్య‌క్ర‌మం అనంత‌రం అలా ప‌చ్చిక బ‌య‌ళ్ల‌లో తిరుగాడారు. 

ఈ సంద‌ర్భంగా తీసిన ఫొటోలు ఇట్టే ఆక‌ట్టుకుంటున్నాయి. ఈ ఫొటోల‌ను కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేశారు.
Justice N.V. Ramana
Jammu & Kashmir
Ladakh
High Court
Kiren Rijiju

More Telugu News