Tirupati: వెంకటేశ్వరస్వామి వేషధారణలో తిరుప‌తి ఎంపీ గురుమూర్తి

tirupati mp gurumoorthy spotted in venkateswara swamy dressing
  • తిరుప‌తిలో కొన‌సాగుతున్న తాతయ్య గుంట గంగ‌మ్మ జాత‌ర‌
  • జాత‌ర‌లో వెంక‌టేశ్వ‌ర‌స్వామి వేష‌ధార‌ణ‌లో గురుమూర్తి
  • గంగ‌మ్మ త‌ల్లికి మొక్కు తీర్చుకున్నాన‌న్న తిరుప‌తి ఎంపీ

వైసీపీ యువ నేత‌, తిరుప‌తి ఎంపీ గురుమూర్తి శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి అవతారం ఎత్తారు. శ్రీవేంక‌టేశ్వ‌ర స్వామి వేష‌ధార‌ణ‌లో క‌నిపించిన ఆయ‌న అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. తిరుప‌తిలో జ‌రుగుతున్న‌ తాతయ్య గుంట గంగ‌మ్మ జాత‌ర‌లో ఈ దృశ్యం క‌నిపించింది. జాత‌ర‌లో భాగంగా ఆదివారం వెంక‌టేశ్వ‌ర స్వామి వేష‌ధార‌ణ‌లో వెళ్లిన గురుమూర్తి గంగ‌మ్మ త‌ల్లికి మొక్కు చెల్లించుకున్నారు. 

ఈ విష‌యాన్ని స్వ‌యంగా గురుమూర్తే ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించారు. తిరుపతి గంగమ్మ జాతరకు చాలా ప్రాముఖ్యత ఉందని చెప్పిన గురుమూర్తి.. కోరిన కోర్కెలు తీర్చే అమ్మగా తాతయ్య గుంట గంగమ్మతల్లి జాతర రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిందని పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News