అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌కు మంత్రి ఎర్ర‌బెల్లి కౌంట‌ర్

  • బీజేపీ నేత‌లు అవాస్త‌వాలు మాట్లాడుతున్నారన్న ఎర్ర‌బెల్లి
  • తెలంగాణపై బీజేపీకి ప్రేమ లేదని మరోసారి రుజువైందని వ్యాఖ్య‌
  • అమిత్ షా చెప్పిన మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరన్న మంత్రి
errabelli slams amit shah

బీజేపీ నేత‌లు అవాస్త‌వాలు మాట్లాడుతున్నారంటూ తెలంగాణ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు మండిప‌డ్డారు. ఈ రోజు ఆయ‌న వ‌రంగ‌ల్‌లో మీడియాతో మాట్లాడుతూ... తెలంగాణపై బీజేపీకి ప్రేమ లేదని మరోసారి రుజువైందని, కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్య‌ల‌న్నీ అబద్ధాలేనని చెప్పారు. త‌మ ప్ర‌భుత్వం ఇచ్చిన హామీల‌న్నింటినీ అమ‌లు చేస్తోంద‌ని తెలిపారు. బీజేపీ ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా అమలు అయిందా? అని ఆయ‌న నిల‌దీశారు. 

అమిత్ షా చెప్పిన మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరని అన్నారు. తెలంగాణ అభివృద్ధి చెంద‌కుండా బీజేపీ నేత‌లు అడ్డుకుంటున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. తెలంగాణ‌కు రావాల్సిన నిధులను కేంద్ర ప్ర‌భుత్వం ఇవ్వ‌ట్లేద‌ని చెప్పారు. తెలంగాణకు ఒక్క మెడికల్‌ కాలేజీ కూడా ఇవ్వలేదని ఆయ‌న అన్నారు కేసీఆర్‌ది త్యాగాల కుటుంబమని, సీఎం కృషిని పార్లమెంటులో కేంద్ర ప్ర‌భుత్వ‌మే ప్ర‌శంసించింద‌ని ఆయ‌న అన్నారు. 

More Telugu News