Congress: ఉల్లాసంగా, ఉత్సాహంగా!...చింత‌న్ శిబిర్‌లో క‌ట్టిప‌డేసే ఫొటోలు ఇవే!

  • ఉద‌య్ పూర్ వేదిక‌గా మూడు రోజుల స‌ద‌స్సు
  • పాత మిత్రుల‌తో కాంగ్రెస్ నేత‌ల భేటీలు
  • వైర‌ల్‌గా మారిన‌ ప్రియాంక‌తో సీత‌క్క ఫొటో
rare photos in congress chintan shivir

రాజ‌స్థాన్‌లోని ఉద‌య్ పూర్ వేదిక‌గా కాంగ్రెస్ పార్టీ మూడు రోజుల పాటు నిర్వ‌హిస్తున్న న‌వ సంక‌ల్ప్ చింత‌న్ శిబిర్‌లో ఆ పార్టీ నేత‌లు ఉల్లాసంగా, ఉత్సాహంగా క‌నిపిస్తున్నారు. శుక్ర‌వారం స‌ద‌స్సు ప్రారంభం కాగానే... పార్టీ అధినేత్రి హోదాలో సోనియా గాంధీ ప్రారంభోప‌న్యాసం చేయ‌గానే... నేత‌లంతా గ్రూప్ డిస్క‌ష‌న్స్‌లోకి వెళ్లిపోయారు. రెండో రోజైన శ‌నివారం కూడా నాన్ స్టాప్‌గా గ్రూప్ డిస్క‌ష‌న్లు జ‌రుగుతున్నాయి. 
ఈ సంద‌ర్భంగా అన్ని రాష్ట్రాల‌కు చెందిన నేత‌లంతా ఒకే చోట క‌ల‌వ‌డంతో ఆయా నేత‌లు త‌మ మిత్రుల‌తో క‌లుస్తున్నారు. ఈ సంద‌ర్భంగా ప‌లు ఫొటోలు జ‌నాల‌ను క‌ట్టి ప‌డేస్తున్నాయి. తెలంగాణ‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే సీత‌క్క... పార్టీ అగ్ర నేత ప్రియాంకా గాంధీతో క‌లిసి దిగిన ఫొటో అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఇలాంటి క‌ట్టిప‌డేసే ఫొటోలు చింత‌న్ శిబిర్‌లో చాలానే క‌నిపించాయి.
.

More Telugu News