న‌ర‌సింహ జ‌యంతిని కోట్ చేస్తూ హ‌రీశ్‌రావుకు బీజేపీ కౌంట‌ర్‌

14-05-2022 Sat 20:23
  • అమిత్ షా ప‌ర్య‌ట‌న‌పై హ‌రీశ్ రావు సెటైర్‌
  • హ‌రీశ్ రావుకు కౌంట‌ర్ ట్వీట్ చేసిన బీజేపీ
  • న‌ర‌సింహ జ‌యంతిని ప్ర‌స్తావిస్తూ ట్వీట్‌
telangana bjp coiter tweet to harish rao
ప్ర‌పంచ వ‌ల‌స ప‌క్షుల దినోత్స‌వాన్ని ప్ర‌స్తావిస్తూ బీజేపీ అగ్ర నేత అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌పై టీఆర్ఎస్ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు సెటైర్ వేస్తే... దానికి ప్ర‌తిస్పందించిన బీజేపీ తెలంగాణ శాఖ న‌ర‌సింహ జ‌యంతిని ప్రస్తావిస్తూ హ‌రీశ్ రావుకు కౌంట‌ర్ సంధించింది. ఈ మేర‌కు ట్విట్ట‌ర్ వేదిక‌గా బీజేపీ తెలంగాణ శాఖ ఓ ట్వీట్‌ను పోస్ట్ చేసింది.

హిర‌ణ్య‌క‌శిపుడిని అంతం చేసేందుకు ల‌క్ష్మీ న‌ర‌సింహ స్వామి ప్ర‌త్య‌క్ష‌మ‌య్యార‌ని చెప్పిన బీజేపీ... ఆ సందర్భాన్ని పుర‌స్క‌రించుకుని న‌ర‌సింహ జ‌యంతిని జ‌రుపుకుంటున్నామ‌ని తెలిపింది. న‌ర‌సింహ జ‌యంతి అంటే చెడుపై మంచి సాధించిన విజ‌యం అని కూడా బీజేపీ తెలిపింది. అలా స‌రిగ్గా న‌ర‌సింహ జ‌యంతి నాడే తెలంగాణ‌లో అమిత్ షా ప‌ర్య‌టిస్తున్నార‌ని, తెలంగాణ‌లో కొన‌సాగుతున్న చెడును అంతం చేసేందుకే ఈ ప‌ర్య‌ట‌న సాగుతోంద‌న్న అర్థం వ‌చ్చేలా బీజేపీ స‌ద‌రు ట్వీట్‌ను పోస్ట్ చేసింది.