అమిత్ షా టూర్‌పై హ‌రీశ్ రావు సెటైరిక‌ల్ ట్వీట్‌

14-05-2022 Sat 19:28
  • నేడు ప్ర‌పంచ వ‌ల‌స ప‌క్షుల దినోత్సవం
  • ఈ రోజే తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన అమిత్ షా
  • రెంటినీ పోలుస్తూ హ‌రీశ్ రావు ట్వీట్‌
harish rao satirical tweet on amit shah telangana tour
బీజేపీ అగ్రనేత‌, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న‌పై టీఆర్ఎస్ కీల‌క నేత‌, తెలంగాణ మంత్రి త‌న్నీరు హ‌రీశ్ రావు ఆస‌క్తిక‌ర‌మైన ట్వీట్‌ చేశారు. శ‌నివారం ప్ర‌పంచ వ‌ల‌స ప‌క్షుల దినోత్స‌వం సంద‌ర్భంగా ట్వీట్ చేసిన హ‌రీశ్ రావు... అమిత్ షాను కూడా వ‌ల‌స ప‌క్షుల‌తో పోల్చి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

'అమిత్ షా విజిట్స్ తెలంగాణ' అనే హ్యాష్ ట్యాగ్ తో హరీశ్ రావు ట్వీట్ ను ప్రారంభించారు. వ‌ల‌స ప‌క్ష‌లు త‌మ‌కు ఇష్ట‌మైన ప్రాంతాల‌కు వ‌స్తుంటాయ‌ని పేర్కొన్న హ‌రీశ్ రావు.. ఆయా ప్రాంతాల్లో ల‌భించే ఆహారాన్ని ఎంజాయ్ చేస్తాయ‌ని చెప్పారు. ఆ త‌ర్వాత అక్క‌డే గుడ్లు పెట్టి తిరిగి త‌మ ప్రాంతాల‌కు హ్యాపీగా వెళ్లిపోతాయ‌ని ఆయ‌న పేర్కొన్నారు. ఇక ఈ రోజు ప్రపంచ వలస పక్షుల దినోత్సవం కావడం కూడా యాధృచ్చిక‌మ‌ని హ‌రీశ్ రావు సెటైర్ సంధించారు.