IPL 2022: కోల్‌క‌తాతో కీల‌క మ్యాచ్... టాస్ ఓడి ఫీల్డింగ్‌కు దిగ‌నున్న హైద‌రాబాద్‌

Kolkata Knight Riders won the toss and elected to bat
  • టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్ క‌తా
  • ఈ మ్యాచ్‌లో విజ‌యంతో హైద‌రాబాద్ మ‌రింత ముందుకు
  • ఓడితే ప్లే ఆఫ్ అవ‌కాశాల‌ను వ‌ది‌లేసుకునే ప్ర‌మాదంలో కోల్‌క‌తా
ఐపీఎల్ తాజా సీజ‌న్‌లో భాగంగా మ‌రికాసేప‌ట్లో హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్ జ‌ట్టు కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్‌తో త‌ల‌ప‌డ‌నుంది. టాస్ నెగ్గిన కోల్‌క‌తా ఫ‌స్ట్ బ్యాటింగ్ ఎంచుకోగా...హైద‌రాబాద్ ఫీల్డింగ్‌కు దిగ‌నుంది. లీగ్ మ్యాచ్‌లు ముగింపు ద‌శ‌కు వ‌చ్చిన నేప‌థ్యంలో హైద‌రాబాద్‌తో పాటు కోల్ క‌తా కు కూడా ఈ మ్యాచ్ కీల‌కం కానుంది. పూణేలోని మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేష‌న్ స్టేడియంలో ఈ మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

ఇప్ప‌టిదాకా హైద‌రాబాద్ 11 మ్యాచ్‌లు ఆడి 5 విజ‌యాల‌తో 10 పాయింట్లు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో 7వ స్థానంలో ఉంది. అదే స‌మ‌యంలో ఇప్ప‌టికే 12 మ్యాచ్‌లు ఆడిన కోల్‌క‌తా 5 విజ‌యాల‌తో 10 పాయింట్లు సాధించి పాయింట్ల ప‌ట్టిక‌లో 8వ స్థానంలో ఉంది. ఇరు జ‌ట్ల ఖాతాలో 10 పాయింట్లే ఉన్నా... నెట్ ర‌న్ రేటు అధికంగా క‌లిగిన హైద‌రాబాద్ జ‌ట్టు కోల్ క‌తా కంటే ఓ మెట్టు పైన ఉంది. ఈ మ్యాచ్‌లో విజ‌యంతో హైద‌రాబాద్‌కు ప్లే ఆఫ్ అవ‌కాశాలు మ‌రింత మెరుగు కానున్నాయి. ఈ మ్యాచ్‌లో ఓడితే కోల్ క‌తాకు ప్లే ఆఫ్ అవ‌కాశాలు మ‌రింత‌గా స‌న్న‌గిల్ల‌నున్నాయి.
IPL 2022
Kolkata Knight Riders
Sunrisers Hyderabad

More Telugu News