రెండేళ్లుగా మిస్సైన ఫన్ 'ఎఫ్ 3'లో దొరికేస్తుంది: సునీల్

14-05-2022 Sat 18:56
  • 'ఎఫ్ 3'లో ముఖ్యమైన రోల్ చేసిన సునీల్
  • తాజా ఇంటర్వ్యూలో ఈ సినిమా గురించిన ప్రస్తావన  
  • నాన్ స్టాప్ నవ్వులు ఖాయమంటూ హామీ 
  • ఈ నెల 27వ తేదీన ఈ సినిమా విడుదల    
Sunil Interview
సునీల్ ఒక వైపున హీరోగా చేస్తూ .. మరో వైపున విలన్ గాను మెప్పిస్తూ, ఇంకోవైపు ముందు నుంచి తనకి అలవాటైన కమెడియన్ గాను సందడి చేస్తున్నాడు. అలాంటి సునీల్ 'ఎఫ్ 3'లో ఒక ముఖ్యమైన పాత్రను పోషించాడు. ఈ సందర్భంగా తాజా ఇంటర్వ్యూలో సునీల్ మాట్లాడాడు. "చాలా కాలం తరువాత నేను మళ్లీ పూర్తి స్థాయి కమెడియన్ గా మీకు కనిపిస్తాను. ఈ సినిమా మొదటి నుంచి చివరివరకూ తెరపై నేను కనిపిస్తూనే ఉంటాను. 

'చింతకాయల రవి' తరువాత వెంకటేశ్ గారితో కలిసి నేను చేసిన సినిమా ఇది. ఆయన కామెడీ టైమింగ్ గురించి మీకు చెప్పనవసరం లేదు. అసలు డైలాగ్ తో పనే లేకుండా ఎక్స్ ప్రెషన్ తో చంపేస్తారాయన. ఇక వరుణ్ కూడా కామెడీలో ఈ మధ్య బాగా ఆరితేరిపోయాడు. ఇద్దరితో కలిసి నటించడం చాలా సంతోషంగా ఉంది.

 కోవిడ్ వలన రేడేళ్ల కాలం ఎన్నో టెన్షన్స్ తో గడిచిపోయింది. అందరూ కూడా నానా రకాలుగా ఇబ్బందులు పడ్డారు. అవన్నీ మరిచిపోయి హాయిగా నవ్వుకునేలా 'ఎఫ్ 3' ఉంటుంది  .. అందుకు నేను గ్యారెంటీ. ఈ నెల 27వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వస్తుంది. అందుకని అందరూ కూడా ఈ సినిమా చూస్తూ ఎంజాయ్ చేయండేం" అంటూ చెప్పుకొచ్చాడు.