త్రిపుర నూత‌న సీఎంగా మాణిక్ సాహా

14-05-2022 Sat 18:29
  • బీజేఎల్పీలో మాణిక్‌ను ఎన్నుకున్న ఎమ్మెల్యేలు
  • బీజేపీ త్రిపుర అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న సాహా
  • రాజ్య‌స‌భ స‌భ్యుడిగానూ కొన‌సాగుతున్న బీజేపీ నేత‌
manik saha is new cm to tripura
త్రిపుర నూత‌న సీఎంగా బీజేపీ ఎంపీ మాణిక్ సాహా ఎంపిక‌య్యారు. ఈ మేర‌కు కాసేప‌టి క్రితం భేటీ అయిన బీజేఎల్పీ భేటీలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు మాణిక్ సాహాను త‌మ నాయ‌కుడిగా ఎన్నుకున్నారు. బీజేపీ త్రిపుర శాఖ అధ్య‌క్షుడిగా కొన‌సాగుతున్న మాణిక్ సాహా... ఆ పార్టీ త‌ర‌ఫున రాజ్య‌స‌భ స‌భ్యుడిగానూ కొన‌సాగుతున్నారు. 

వ‌చ్చే ఏడాది త్రిపుర అసెంబ్లీకి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో పార్టీ జాతీయ నాయ‌క‌త్వం జారీ చేసిన ఆదేశాల మేర‌కు సీఎం ప‌ద‌వికి బిప్ల‌వ్ కుమార్ దేవ్ రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. బిప్ల‌వ్ రాజీనామా చేసిన మ‌రుక్ష‌ణ‌మే భేటీ అయిన బీజేఎల్పీ స‌మావేశంలో మాణిక్ సాహాను ఆ పార్టీ ఎమ్మెల్యేలు నూత‌న సీఎంగా ఎన్నుకోవ‌డం గ‌మ‌నార్హం.