కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డితో 'మా' అధ్య‌క్షుడు మంచు విష్ణు భేటీ

14-05-2022 Sat 18:21
  • హైద‌రాబాద్‌లో జ‌రిగిన భేటీ
  • భేటీకి గ‌ల కార‌ణాలు వెల్ల‌డి కాని వైనం
  • భేటీ గురించి వెల్లడించిన కిష‌న్ రెడ్డి కార్యాలయం 
manchu vishnu meets union minister kishan reddy
కేంద్ర సాంస్కృతిక, ప‌ర్యాట‌క శాఖ మంత్రి కిష‌న్ రెడ్డితో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ (మా) అధ్య‌క్షుడు మంచు విష్ణు భేటీ అయ్యారు. శ‌నివారం హైద‌రాబాద్‌లో జ‌రిగిన ఈ భేటీలో కేంద్ర మంత్రితో విష్ణు ఏం మాట్లాడార‌న్న వివ‌రాలు మాత్రం వెల్ల‌డి కాలేదు. మంచు విష్ణు త‌న‌ను క‌లిసిన విష‌యాన్ని కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి కార్యాలయం త‌న ట్విట్ట‌ర్ వేదిక‌గా వెల్ల‌డించింది. ఈ భేటీకి సంబంధించిన వివ‌రాలు వెల్ల‌డి కావాల్సి ఉంది.