విజయవాడలో 'సర్కారువారి పాట' గ్రాండ్ సక్సెస్ మీట్!

14-05-2022 Sat 17:55
  • తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్లు 
  • ఓవర్సీస్ లోను అదే జోరు 
  • ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల గ్రాస్ 103 కోట్లు 
  • ఈ నెల 16వ తేదీన గ్రాండ్ సక్సెస్ మీట్
Sarkaru Vaari Paata movie update
మహేశ్ బాబు .. పరశురామ్ కాంబినేషన్లో రూపొందిన 'సర్కారువారి పాట' ఈ నెల 12వ తేదీన థియేటర్లకు వచ్చింది.కీర్తి సురేశ్ కథానాయికగా నటించిన ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. మాస్ బీట్స్ ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఈ నెల 16వ తేదీన విజయవాడలో గ్రాండ్ గా నిర్వహించనున్నారు. 

ఈ సక్సెస్ మీట్ ను ఆ రోజున సిద్ధార్థ హోటల్ మేనేజ్ మెంట్ గ్రౌండ్ లో సాయంత్రం 5 గంటల నుంచి మొదలెట్టనున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా తెలియజేస్తూ అందుకు సంబంధించిన పోస్టర్ ను విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రెండు రోజుల్లో 103 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. 

ఇక  యూఎస్ లో ఈ సినిమా 1.6 మిలియన్స్ కి పైగా వసూళ్లను రాబట్టింది. ఈ రెండు రోజుల్లోను ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 48.53 కోట్ల షేర్ ను వసూలు చేసింది. యాక్షన్ .. కామెడీ .. సాంగ్స్ ఈ సినిమాను చాలా వరకూ నిలబెట్టాయి. వీకెండ్ తరువాత ఈ సినిమా వసూళ్లు ఎలా ఉంటాయనేది చూడాలి.