మ‌లయాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్‌కు ఈడీ నోటీసులు

14-05-2022 Sat 16:58
  • మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో కేర‌ళ వ్యాపారి మాన్స‌న్ అరెస్ట్‌
  • మాన్స‌న్‌తో క‌లిసి మోహ‌న్ లాల్ కూడా అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డ‌ట్టు ఆరోప‌ణ‌లు
  • వ‌చ్చే వారం విచార‌ణ‌కు రావాలంటూ మోహ‌న్ లాల్‌కు ఈడీ నోటీసులు
ed notices to malayalam super star mohan lal
మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ చిక్కుల్లో ప‌డ్డారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసింది. వ‌చ్చే వారం విచార‌ణ‌కు రావాలంటూ ఈడీ అధికారులు ఆయ‌న‌కు నోటీసులు జారీ చేశారు. విచార‌ణ కోసం కొచ్చిలోని ఈడీ కార్యాల‌యానికి రావాలంటూ ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.

కేర‌ళ‌కు చెందిన వ్యాపారి మాన్స‌న్ మాన్క‌ల్‌తో క‌లిసి మోహ‌న్ లాల్ మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్టు ఆరోప‌ణ‌లున్నాయి. ఈ కేసులో మాన్స‌న్‌ను గ‌తేడాది సెప్టెంబ‌ర్‌లోనే కేర‌ళ పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా ఈ కేసుపై దృష్టి సారించిన ఈడీ... మాన్స‌న్‌తో క‌లిసి మోహ‌న్ లాల్ కూడా మ‌నీ ల్యాండ‌రింగ్‌కు పాల్ప‌డిన‌ట్టు భావిస్తోంది. ఈ విష‌యం నిర్ధార‌ణ కోస‌మే ఆయ‌న‌కు నోటీసులు జారీ చేసిన‌ట్లు తెలుస్తోంది.