Tollywood: విజయ్ దేవరకొండది ఎంతో దయాగుణం.. పొగడ్తల్లో ముంచెత్తిన బాలీవుడ్ భామ అనన్య పాండే

Ananya Panday All Praises Vijay Deverakonda
  • అమెరికాలో షూటింగ్ అప్పుడు సరదాగా గడిపామన్న అనన్య 
  • ‘లైగర్’ మాంచి మసాలా సినిమా అని వ్యాఖ్య 
  • అందరికీ నచ్చుతుందన్న ముద్దుగుమ్మ

పూరీ జగన్నాథ్ తో తొలిసారి జట్టు కట్టాడు విజయ్ దేవరకొండ. బాలీవుడ్ భామ అనన్య పాండే అతడితో జత కట్టింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ పవర్ ఫుల్ రోల్ పోషిస్తున్నాడు. మొత్తంగా ‘లైగర్’ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా త్వరలోనే మన ముందుకు వచ్చేస్తోంది. ఈ సినిమా గురించి హీరోయిన్ అనన్య పాండే ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండను పొగడ్తల్లో ముంచెత్తింది. 

విజయ్ ది ఎంతో దయాగుణమని వ్యాఖ్యానించింది. అద్భుతమైన వ్యక్తి అని చెప్పింది. అమెరికాలో షూటింగ్ సమయంలో సరదాగా గడిపామని గుర్తు చేసుకుంది. సినిమాకు సంబంధించి దాదాపు అన్నీ పూర్తయ్యాయని, నా డబ్బింగ్ పార్ట్ కూడా అయిపోయిందని చెప్పింది. ఆగస్టులో సినిమా విడుదలవుతుందని, మాంచి మసాలా సినిమా అని చెప్పుకొచ్చింది. సినిమాను చూసి అభిమానులు ఆనందిస్తారని తెలిపింది.  

కాగా, ఈ సినిమాను ఆగస్టు 25న విడుదల చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తోంది. తెలుగు, హిందీ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదలవుతుంది. విజయ్ కు బాలీవుడ్ ఎంట్రీ తొలిసారి కావడం విశేషం. అటు అనన్య పాండేకి కూడా తెలుగులో అరంగేట్ర సినిమా ఇది.

  • Loading...

More Telugu News