మాట్లాడలేకపోతున్నానంతే.. చనిపోలేదు: వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద
- నిత్యానంద అనారోగ్యంతో చనిపోయినట్టు వార్తలు
- తాను నిక్షేపంగా ఉన్నానంటూ ఫేస్‌బుక్ పోస్టు
- సమాధిలోకి వెళ్లానని, ప్రస్తుతం మాట్లాడడం ఇబ్బందిగా ఉందన్న స్వామీజీ
- 27 మంది వైద్యులు చికిత్స అందిస్తున్నారని వెల్లడి
నిత్యానంద నవంబరు 2019లో భారత్ వదిలి పారిపోయి ఈక్వెడార్ సమీపంలోని ఓ ద్వీపంలో ఉంటున్నారు. దానికి ‘కైలాస’ అని నామకరణం చేసి దానికి ప్రధానిగా ప్రకటించుకున్నారు. అంతేకాదు, దానిని ప్రత్యేక దేశంగా ప్రకటించాలని ఐక్యరాజ్య సమితికి అభ్యర్థన కూడా పంపారు. ఆ తర్వాత కైలాస డాలర్‌ను తీసుకొచ్చారు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ కైలాసను ప్రారంభించనున్నట్టు చెప్పారు. ఆయన ప్రతీ ప్రకటన ఓ సంచలనమైంది.
ఇన్ని ప్రకటనలు చేసినా నిత్యానంద ఎక్కడ ఉన్నారన్న విషయం స్పష్టంగా ఎవరికీ తెలియదు. ఆయన ఈక్వెడార్‌లో ఉంటున్నట్టు పోలీసులు చెబుతున్నా.. ఆ వార్తలను ఆ దేశం ఖండిస్తోంది. కాగా, నిత్యానందపై లైంగిక ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుల్లో ఆయన భారత్‌లో 50సార్లు కోర్టుకు హాజరయ్యారు. ఆ తర్వాత అకస్మాత్తుగా దేశం నుంచి మాయమయ్యారు.