Mahesh Babu: ఇంతకీ కీర్తి సురేశ్ కి హిట్ పడినట్టేనా?

Sarkaru Vaari Paata movie update
  • 'మహానటి' తరువాత గ్యాప్ ఇచ్చిన కీర్తి సురేశ్ 
  • నిరాశపరిచిన లేడీ ఓరియెంటెడ్ సినిమాలు 
  • ఇతర భాషల్లోను వరుస పరాజయాలే
  • వీకెండ్ తరువాత తేలిపోనున్న 'సర్కారువారి పాట' ఫలితం  
'నేను శైలజ' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన కీర్తి సురేశ్ పేరు, 'మహానటి' సినిమాతో మారుమ్రోగిపోయింది. ఆ సినిమా హిట్ తరువాత ఇక ఆమె జోరు మొదలైనట్టేనని అంతా అనుకున్నారు. కానీ ఆమె తెలుగు సినిమాలను పక్కన పెట్టేసి వరుసగా తమిళ సినిమాలు చేస్తూ వెళ్లింది. మధ్యలో మలయాళానికి కూడా వెళ్లింది. 

చాలా గ్యాప్ తరువాత తెలుగుకు వచ్చి లేడీ ఓరియెంటెడ్ సినిమాలు రెండు చేసింది. ఆ సినిమాలను ఆమె ఎందుకు చేసిందనేది ఆడియన్స్ కి ఇప్పటికీ అర్థం కాలేదు. 'మహానటి' తరువాత దాదాపు ఆమె స్టార్ హీరోల సినిమాల్లోనే చేసింది. ఆ జాబితాలో రజనీ .. మోహన్ లాల్ .. విక్రమ్ వంటి సీనియర్ హీరోలు కూడా ఉన్నారు. 

కానీ ఏ సినిమా కూడా కీర్తి సురేశ్ కి హిట్టు పట్టుకురాలేకపోయింది. దాంతో అంతా కూడా 'సర్కారువారి పాట' పైనే దృష్టి పెట్టారు. ఈ నెల 12వ తేదీన ఈ సినిమా విడుదలైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమాతో కీర్తి సురేశ్ ఖాతాలో హిట్ పడినట్టేనా? అనే డౌట్లు అంతటా వ్యక్తమవుతున్నాయి. వీకెండ్ తరువాత ఈ ప్రశ్నకి సమాధానం దొరికిపోతుందనే చెప్పచ్చు.
Mahesh Babu
Keerthy Suresh
Sarkaruvari Paata Movie

More Telugu News