Buddavanam: రేపు బుద్ధవనం ప్రాజెక్టు ప్రారంభోత్సవం... కేంద్రం కూడా నిధులు కేటాయించిందన్న కిషన్ రెడ్డి

  • సాగ‌ర్ స‌మీపంలో బుద్ధ‌వ‌నం ప్రాజక్టు 
  • కేంద్ర ప‌ర్యాట‌క శాఖ నుంచి రూ.22.24 కోట్లు
  • కేటీఆర్‌, జ‌గ‌దీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ ల చేతుల మీదుగా ప్రాజెక్టు ప్రారంభోత్సవం
kishan reddy statement on buddavanam project inaufuration

నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జున సాగర్ సమీపంలో తెలంగాణ సర్కారు బుద్ధవనం ప్రాజెక్టును నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. కేంద్ర పర్యాటక శాఖ నుంచి విడుద‌లైన‌ రూ.22.24 కోట్ల‌తో పాటు రాష్ట్ర ప్ర‌భుత్వం త‌న వాటాగా కొంత‌మేర నిధుల‌ను కేటాయించి ఈ ప్రాజెక్టును చేప‌ట్టింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం తాజాగా పూర్తి కాగా... తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాజెక్టును శ‌నివారం ప్రారంభించ‌నుంది. 

ఈ మేర‌కు తెలంగాణ ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మంపై కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి శుక్ర‌వారం నాడు ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. బుద్ధ‌వ‌నం ప్రాజెక్టును శ‌నివారం తెలంగాణ మంత్రులు ప్రారంభించ‌నున్నారంటూ కిష‌న్ రెడ్డి శుక్ర‌వారం ట్వీట్ చేశారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర ప‌ర్యాట‌క శాఖ నుంచి రూ.22.24 కోట్ల నిధులు విడుద‌లయ్యాయ‌ని కూడా ఆయ‌న ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. ఈ ప్రాజెక్టును శ‌నివారం తెలంగాణ మంత్రులు కేటీఆర్‌, జ‌గ‌దీశ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ త‌దిత‌రులు ప్రారంభించ‌నున్నారు.

More Telugu News