Jammu And Kashmir: కశ్మీరీ పండిట్ హత్యపై ఆయన భార్య సంచలన వ్యాఖ్యలు

Kashmiri pandit wife response on his murder by terrorists
  • జమ్ముకశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో దారుణం
  • రాహుల్ భట్ ను కాల్చి చంపిన ఉగ్రవాదులు
  • తోటి ఉద్యోగులే ఉగ్రవాదులతో కలిసి కుట్ర చేశారన్న భార్య
జమ్ముకశ్మీర్ లోని బుద్గాం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి అయిన కశ్మీరీ పండిట్ రాహుల్ భట్ ను ఆయన కార్యాలయంలోనే ఉగ్రవాదులు కాల్చి చంపిన సంగతి తెలిసిందే. కార్యాలయంలోకి ప్రవేశించిన ఇద్దరు ఉగ్రవాదులు పాయింట్ బ్లాంక్ లో ఆయనను కాల్చి చంపి పరారయ్యారు. 

ఈ దారుణ ఘటనపై ఆయన భార్య స్పందిస్తూ సంచలన ఆరోపణలు చేశారు. తన భర్తను చంపేందుకు ఆయన కార్యాలయంలోని తోటి ఉద్యోగులే ఉగ్రవాదులతో కలిసి కుట్ర చేసి ఉంటారని ఆరోపించారు. తాను పని చేస్తున్న కార్యాలయంలో తనకు భద్రత లేదని, జిల్లాలోని ప్రధాన కార్యాలయానికి బదిలీ చేయాలని తన భర్త పలుమార్లు విజ్ఞప్తి చేశారని చెప్పారు. కానీ అధికారులు స్పందించలేదని తెలిపారు. ఇంతలోనే ఘోరం జరిగిపోయిందని కంటతడి పెట్టారు.
Jammu And Kashmir
Kashmiri Pandit
Murder
Terrorists
Wife

More Telugu News