YSRCP: కేంద్ర మంత్రి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ చైర్మ‌న్ల‌తో వైసీపీ ఎంపీ గురుమూర్తి భేటీ

ysrcp mp gurumurthy met union minisrter and airports authority chairman in delhi
  • వెంక‌ట‌గిరి కేంద్రీయ విద్యాలయంలో ఇంట‌ర్ కోర్సును ప్రారంభించాలని విన‌తి
  • కేంద్ర మంత్రికి విన‌తి ప‌త్రం అంద‌జేసిన గురుమూర్తి
  • రేణిగుంట ఎయిర్‌పోర్టు స‌మ‌స్య‌ల‌పై సంజీవ్ కుమార్‌కు నివేదన‌
వైసీపీ యువ నేత‌, తిరుప‌తి ఎంపీ గురుమూర్తి గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యా శాఖ స‌హాయ మంత్రి అన్న‌పూర్ణ దేవి, ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్మ‌న్ సంజీవ్ కుమార్‌ల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న త‌న నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని ప‌లు స‌మ‌స్య‌ల‌ను వారి ముందు ఉంచారు. 

తిరుప‌తి పార్ల‌మెంటు నియోజ‌కవ‌ర్గ ప‌రిధిలోని వెంక‌ట‌గిరి కేంద్రీయ విద్యాల‌యంలో ఇంట‌ర్మీడియట్ కోర్సుల‌ను ప్రారంభించాలని విద్యా శాఖ స‌హాయ మంత్రిని కోరారు. ఈ మేర‌కు ఆయ‌న ఓ విన‌తి ప‌త్రాన్ని కేంద్ర మంత్రికి అందించారు. అదే స‌మ‌యంలో తిరుప‌తి ప‌రిధిలోని రేణిగుంట ఎయిర్‌పోర్టు స‌మ‌స్య‌ల‌ను ప్రస్తావిస్తూ ఎయిర్‌పోర్ట్ అథారిటీ చైర్మ‌న్ సంజీవ్ కుమార్‌కు విన‌తి ప‌త్రం అంద‌జేశారు.
YSRCP
Tirupati MP
Maddila Gurumoorthy
Annpurna Devi

More Telugu News