త‌గ్గేదేలే!... టీడీపీ ఆరోప‌ణ‌ల‌పై అంబ‌టి రాంబాబు ప్ర‌క‌ట‌న‌!

  • అంబ‌టిపై టీడీపీ వ‌రుస విమ‌ర్శ‌లు
  • మంత్రిపై అయ్య‌న్న కీల‌క వ్యాఖ్య‌లు
  • త‌గ్గేదేలే అంటూ అంబ‌టి ట్వీట్‌
ap minister ambati rambabu tweet to tdp

వైసీపీ కీల‌క నేత‌, ఏపీ జ‌ల‌వ‌న‌రుల శాఖ‌ మంత్రి అంబ‌టి రాంబాబుపై విప‌క్ష టీడీపీ నేత‌లు వ‌రుస‌బెట్టి విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు అయితే అంబ‌టి త‌గ్గ‌కుంటే ఆయ‌న‌కు చెందిన మ‌రిన్ని వీడియోలు విడుద‌ల చేస్తామంటూ హెచ్చ‌రించారు. అయినా కూడా అంబ‌టి రాంబాబు త‌గ్గ‌క‌పోవ‌డంతో ఓ యూట్యూబ్ ఛానెల్‌కు చెందిన మ‌హిళా జ‌ర్న‌లిస్టుతో అంబ‌టి అస‌భ్యంగా మాట్లాడార‌ని కూడా అయ్య‌న్న గురువారం నాడు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.

ఇలాంటి నేప‌థ్యంలో ట్విట్ట‌ర్ వేదిక‌గా టీడీపీ ఆరోప‌ణ‌లు, హెచ్చ‌రిక‌ల‌పై మంత్రి అంబ‌టి రాంబాబు ఘాటుగా స్పందించారు. "న‌న్ను అంటారు.. తిరిగి అంటే... టీడీపీతో పాటు ఈనాడు, టీవీ 5, ఆంధ్రజ్యోతి కలసికట్టుగా నా మీద పడి ఏడుస్తారు. ఎంత ఏడ్చినా.. ఎంత మొరొగినా... తగ్గేదేలే!!" అంటూ అంబ‌టి రాంబాబు ప్ర‌తిస్పందించారు.

More Telugu News