Harish Rao: హ‌రీశ్ రావుతో రాజా సింగ్‌...ఉస్మానియా ఆసుప‌త్రిలో అరుదైన చిత్రం

harish rao and bjp mla raja singh attends a programme in osmania hospital
  • ఉస్మానియా ఆసుప‌త్రిలో రోగి స‌హాయ‌కుల‌కు భోజ‌న ప‌థ‌కం ప్రారంభం
  • హోం మంత్రి మ‌హ‌మూద్ అలీతో క‌లిసి ప్రారంభించిన హ‌రీశ్ రావు
  • కార్య‌క్ర‌మానికి స్థానిక ఎమ్మెల్యే హోదాలో హాజ‌రైన రాజా సింగ్‌
  • రాజా సింగ్‌తోనే రిబ్బ‌న్ క‌ట్ చేయించిన హ‌రీశ్ రావు
హైద‌రాబాద్‌లోని ఉస్మానియా ఆసుప‌త్రిలో గురువారం జ‌రిగిన ఓ అధికారిక కార్య‌క్ర‌మంలో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం క‌నిపించింది. నిత్యం ప‌ర‌స్ప‌ర విమ‌ర్శ‌లు చేసుకునే టీఆర్ఎస్‌, బీజేపీల‌కు చెందిన కీల‌క నేత‌లు న‌వ్వుతూ తుళ్లుతూ క‌నిపించారు. టీఆర్ఎస్‌కు చెందిన మంత్రి హ‌రీశ్ రావు, బీజేపీకి చెందిన ఎమ్మెల్యే రాజా సింగ్ ఒకే ఫ్రేమ్‌లో క‌నిపించి సంద‌డి చేశారు. 

ఉస్మానియా ఆసుపత్రిలో రోగి సహాయకుల కోసం ఏర్పాటు చేసిన మూడు పూటలా భోజన పథకాన్ని గురువారం హోం మంత్రి మ‌హ‌మూద్ అలీతో క‌లిసి హ‌రీశ్ రావు ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి స్థానిక ఎమ్మెల్యే హోదాలో గోషామ‌హ‌ల్ ఎమ్మెల్యేగా ఉన్న రాజా సింగ్ కూడా హాజ‌ర‌య్యారు. ఈ కార్య‌క్ర‌మంలో రాజా సింగ్‌తోనే హ‌రీశ్ రావు రిబ్బ‌న్ క‌టింగ్ చేయించ‌డం గ‌మ‌నార్హం.
Harish Rao
Raja Singh
TRS
BJP
Osmania Hospital

More Telugu News