Israel: రిపోర్టింగ్ చేస్తున్న సమయంలో.. మ‌హిళా జ‌ర్న‌లిస్టు తలలోకి దూసుకుపోయిన బుల్లెట్

Al Zajeera woman reporter dead in Israel forces firing
  • వెస్ట్ బ్యాంక్ లో రిపోర్టింగ్ చేస్తుండగా దారుణం
  • ఇజ్రాయెల్ బలగాల కాల్పుల్లో దూసుకుపోయిన బుల్లెట్
  • దుర్మరణం చెందిన అల్ జజీరా జర్నలిస్టు
ఇజ్రాయెల్ దళాలు జరిపిన దాడిలో అల్ జజీరా సంస్థకు చెందిన మహిళా జర్నలిస్ట్ షిరిన్ అబు అలేహ్ మృతి చెందారు. ఈ విషయాన్ని అల్ జజీరా వెల్లడించింది. వెస్ట్ బ్యాంక్ లో నిన్న తెల్లవారుజామున ఈ దారుణం జరిగిందని తెలిపింది. 

వెస్ట్ బ్యాంకులో భద్రతాదళాలు, ఆందోళనకారుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్న సమయంలో అక్కడ రిపోర్టింగ్ చేస్తున్న షిరిన్ అబు అలేహ్ తలలోకి బుల్లెట్ దూసుకుపోయిందని, ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిందని వెల్లడించింది. తమ జర్నలిస్ట్ మరణానికి ఇజ్రాయెల్ దళాల తప్పిదమే కారణమని నిందించింది. అంతర్జాతీయ చట్టాలను ఇజ్రాయెల్ దళాలు ఉల్లంఘించాయని విమర్శించింది. కావాలనే ఈ దారుణానికి పాల్పడ్డారని, ఈ విషయంలో అంతర్జాతీయ సమాజం జోక్యం చేసుకోవాలని కోరింది. 

మరోవైపు ఈ ఘటనపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి యైర్ లాపిడ్ మాట్లాడుతూ, ఈ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించామని చెప్పారు. సంఘర్షణ ఉన్న ప్రాంతాల్లో జర్నలిస్టులకు భద్రత కల్పించాలని ట్వీట్ చేశారు.
Israel
Al Zajeera
Reporter
Firing

More Telugu News