Murder: హైదరాబాద్ లో నడిరోడ్డుపై యువకుడి దారుణ హత్య

Youth Murdered On Mid Road In Hyderabad
  • నిన్న అర్ధరాత్రి ఘటన
  • కత్తులతో నరికి చంపిన దుండగులు
  • సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు

హైదరాబాద్ లో నడిరోడ్డుపై ఓ యువకుడిని దారుణంగా హత్య చేశారు. నిన్న అర్ధరాత్రి లంగర్ హౌస్ లోని మెట్రోపిల్లర్ 96 వద్ద దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. కత్తులతో నరికి చంపి అక్కడి నుంచి పరారయ్యారు. చనిపోయిన వ్యక్తిని చాంద్రాయణగుట్టలోని షాహీన్ నగర్ కు చెందిన జహంగీర్ (22)గా గుర్తించారు. 

హత్య ఘటనకు సంబంధించి పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఘటన స్థలంలో క్లూస్ టీమ్ తో ఆధారాలు తీసుకున్నారు. హత్యకు గల కారణాలను విచారిస్తున్నారు. పాత కక్షలతో చంపారా? వేరే ఏదైనా కారణమా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు సాగుతోంది.

  • Loading...

More Telugu News