Jaisa raja: నేతకు తగ్గట్టే అనుచరులు కూడా.. కాంగ్రెస్ పై మరో వీడియో వదిలిన బీజేపీ

Jaisa raja waisi praja After Rahuls pub row BJP snipes at Congress over video of partying workers
  • నేపాల్ పబ్ లో రాహుల్ వీడియో వైరల్ 
  • తాజాగా నాగ్ పూర్ పార్టీ కార్యక్రమంలో యువ నేతలు
  • జైసే నేత వైసీ ఫాలోవర్ అంటూ పూనావాలా విసుర్లు 
యథా రాజ.. తథా ప్రజ.. వినే ఉంటారు. రాజు ఎలా ఉంటే ప్రజలు కూడా అలానే ఉంటారని. కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్ గాంధీ ఇటీవలే నేపాల్ లో స్నేహితురాలి వివాహానికి వెళ్లి నైట్ క్లబ్ లో గడిపిన వీడియో బయటకు రావడం తెలిసిందే. ఈ వీడియోను బీజేపీ బయట పెట్టింది. ఇందులో తప్పు ఏముందంటూ కాంగ్రెస్ విరుచుకుపడింది.

ఇప్పుడు దీనికి సీక్వెల్ గా బీజేపీ మరో వీడియో విడుదల చేసింది. నాగ్ పూర్ లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ శిక్షణా కార్యక్రమంలో.. రంగు రంగుల కాంతుల మధ్య నృత్యాలతో చేసుకుంటున్న సంబరాలు ఈ వీడియోలో ఉన్నాయి. ‘‘ఐఎన్ సీ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్) అంటే.. ‘ఐ నీడ్ సెలబ్రేషన్ అండ్ పార్టీ’ అంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. కాంగ్రెస్ కార్యకర్తల సెలబ్రేషన్ వీడియోను కూడా జతచేశారు. 

‘‘మహారాష్ట్ర ప్రదేశ్ యూత్ కాంగ్రెస్ నూతన ఆఫీసు బేరర్ల ట్రెయినింగ్? పార్టీయింగ్? క్యాంప్. వీడియో చూడండి. పాటలు వినండి. నేపాల్ పబ్ లో రాహుల్. జూనియర్ నేతలు పార్టీ శిక్షణా శిబిరంలో. జైసా నేత వైసీ ఫాలోవర్ ( నేతకు తగ్గట్టే అనుచరులు)’’ అంటూ షెహనాజ్ విమర్శలు కురిపించారు. 

Jaisa raja
waisi praja
Rahul Gandhi
pub
vedio
youth congress
workers
celebratiob
BJP

More Telugu News