Pixel 6a: భారత మార్కెట్లోకి త్వరలోనే గూగుల్ పిక్సల్ 6ఏ

  • ప్రకటించిన గూగుల్
  • రూ.40 వేల స్థాయిలో ధర
  • 5జీ నెట్ వర్క్ కు సపోర్ట్
  • వెనుక భాగంలో డ్యుయల్ కెమెరా
Pixel 6a India price release and availability tipped ahead of official launch

గూగుల్ పిక్సల్ 6ఏ స్మార్ట్ ఫోన్ భారత యూజర్లను త్వరలోనే పలకరించనుంది. పిక్సల్ 4ఏ తర్వాత వస్తున్న ఫోన్ ఇది. పిక్సల్ 5ఏను గూగుల్ భారత మార్కెట్ కు తీసుకురాలేదు. పిక్సల్ 6ఏ ను త్వరలో భారత మార్కెట్లో విడుదల చేయనున్నట్టు గూగుల్ తాజాగా ప్రకటించింది. కాకపోతే అధికారికంగా ఏ రోజు విడుదల చేస్తున్నదీ, ధర తదితర వివరాలను ఇంకా వెల్లడించలేదు. 

గూగుల్ పిక్సల్ 4ఏను 2020 అక్టోబర్ లో గూగుల్ భారత్ కు తీసుకొచ్చింది. ఈ ప్రకారం ఈ ఏడాది అక్టోబర్ లో 6ఏను తీసుకొస్తుందేమో చూడాలి. పిక్సల్ 6ఏ ధర రూ.40,000 స్థాయిలో ఉండొచ్చన్న అంచనా వ్యక్తమవుతోంది. అమెరికాలో దీని ధర 499 డాలర్లు. మన కరెన్సీ లో సుమారు రూ.38,000. దిగుమతి సుంకాలు, పన్నులు కలుపుకుంటే రూ.40వేలు దాటిపోవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం పిక్సల్ 4ఏ ఫ్లిప్ కార్ట్ పైనే విక్రయమవుతోంది. అలాగే 6ఏ విక్రయాలు కూడా ఫ్లిప్ కార్ట్ నుంచే చేయవచ్చని తెలుస్తోంది. 

6ఏ ఫోన్ ఓఎల్ఈడీ డిస్ ప్లే, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, ప్లాస్టిక్ బాడీ, ఐపీ67 రేటింగ్, 4,410 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ తో రానుంది. 12.2 ఎంపీ డ్యుయల్ పిక్సల్ మెయిన్ కెమెరా, 12 మెగా పిక్సల్ అల్ట్రా వైడ్ కెమెరా, సెల్ఫీల కోసం 8 మెగాపిక్సల్ కెమెరా ఉంటాయి. ఇది 5జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది.

More Telugu News