Andhra Pradesh: విజయవాడలో ఆప్కో షోరూంను సందర్శించిన మంత్రి రోజా

Roja Visits APCO Show Room
  • నేతన్నలకు అండగా ఉంటామని మంత్రి హామీ
  • ఏటా వారికి రూ.24 వేలు ఇస్తున్నామని వెల్లడి
  • ఆప్కో షోరూంలు ప్రతి ఊర్లోనూ ఉన్నాయన్న రోజా 
చేనేత కార్మికులకు అండగా ఉంటామని ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. చేనేత కార్మికుల బాగు కోసం వారి కుటుంబాలకు ఏటా జగన్ ప్రభుత్వం రూ.24 వేలు ఇస్తోందని గుర్తు చేశారు. ఆప్కో సమ్మర్ మేళా సందర్భంగా ఆమె ఇవాళ విజయవాడలోని ఆప్కో షోరూమ్ ను సందర్శించారు. మేళాకు ఆహ్వానించినందుకు సంతోషంగా ఉందని చెప్పారు. ప్రతి ఊరిలోనూ ఆప్కో శాఖలున్నాయన్నారు. ప్రత్యేక ఆఫర్లు, డిజైన్లతో ఆప్కో అందరినీ ఆకర్షిస్తోందని చెప్పారు. అన్ని రకాల కలెక్షన్లు షోరూంలో దొరుకుతాయన్నారు.
Andhra Pradesh
APCO
Vijayawada
Roja

More Telugu News