Kangana Ranaut: నాపై రూమర్ల వల్లే పెళ్లి చేసుకోలేకపోయాను: కంగనా రనౌత్

Kangana Ranaut says she is unable to get married because of rumours spread about her that she beats up boys
  • యాక్షన్ ఆధారిత ధాకడ్ లో నటించిన కంగనా
  • నిజ జీవితంలో అలానే ఉంటారా..? అంటూ ఇంటర్వ్యూలో ప్రశ్న
  • నేను ఎవరిని కొట్టానో చూపించండి? అంటూ ఎదురు ప్రశ్న  
తన విషయంలో వదంతులు వ్యాప్తి చేస్తుండడం వల్లే తాను వివాహం చేసుకోలేకపోయినట్టు బాలీవుడ్ నటి కంగనా రనౌత్ అన్నారు. ఈ వదంతులే తనను సరైన జోడీని గుర్తించకుండా అడ్డుపడినట్టు ఆమె నవ్వుతూ చెప్పారు. కంగన నటించిన గూఢచార, యాక్షన్ ఆధారిత 'ధాకడ్' సినిమా త్వరలో విడుదల కానుండడం తెలిసిందే. 

నిజ జీవితంలోనూ టామ్ బోయ్ మాదిరిగానే ఉంటారా? అంటూ ఓ ఇంటర్వ్యూలో భాగంగా కంగనా రనౌత్ ఒక ప్రశ్న ఎదుర్కొంది. దీనికి ఆమె నవ్వుతూ.. ‘‘నేను అలా ఉండను. నిజ జీవితంలో నేను ఎవరిని కొట్టాను? చూపించండి. మీ లాంటి వ్యక్తులు ఈ తరహా పుకార్లను వ్యాప్తి చేయడం వల్లే నేను పెళ్లి చేసుకోలేకపోయాను’’ అని ఆమె బదులిచ్చారు. 

కఠినంగా ఉంటారన్న అభిప్రాయం వల్లే పెళ్లి చేసుకోలేకపోయారా? అని అడగ్గా.. 'అవును నేను అబ్బాయిలను కొడతానన్న పుకార్లు వ్యాపించడం వల్లే' అని ఆమె చెప్పారు.
Kangana Ranaut
marriage
rumors
beating
boys

More Telugu News