ఎగస్ట్రాలు చేస్తే ఇక వీడియోలే!... అంబ‌టి రాంబాబుకు అయ్య‌న్న వార్నింగ్‌!

11-05-2022 Wed 20:09 | Andhra
  • ట్విట్ట‌ర్ వేదిక‌గా వైసీపీ, టీడీపీ మ‌ధ్య మాట‌ల యుద్ధం
  • అంబ‌టిపై సెటైర్ సంధించిన జై టీడీపీ
  • ఘాటుగా స్పందించిన మంత్రి అంబ‌టి రాంబాబు
ayyannapatrudu strong warning to ambati rambabu
ఏపీలో అధికార వైసీపీ, విప‌క్ష టీడీపీల మ‌ధ్య మాట‌ల యుద్ధం కొన‌సాగుతోంది. ఇరు పార్టీల‌కు చెందిన నేత‌లు ఆయా అంశాల‌పై ట్విట్ట‌ర్ వేదిక‌గా ప‌ర‌స్ప‌రం సవాళ్లు చేసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో టీడీపీ సీనియ‌ర్ నేత చింత‌కాయ‌ల అయ్య‌న్న‌పాత్రుడు ఏపీ మంత్రి అంబ‌టి రాంబాబుకు బుధ‌వారం నాడు ఓ తీవ్ర హెచ్చ‌రిక చేశారు. 

ఇటీవలే ఓ మ‌హిళ‌తో స‌న్నిహితంగా మాట్లాడుతున్న రాంబాబు వీడియో ఒక‌టి బ‌య‌ట‌కు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. ఈ వీడియోను ప్ర‌స్తావించిన టీడీపీ సోష‌ల్ మీడియా విభాగం అంబ‌టిపై సెటైర్లు వేసింది. ఆ ట్వీట్‌పై అంబ‌టి కూడా అదే రేంజిలో కాస్తంత ఘాటు వ్యాఖ్య‌లే చేశారు. అంబ‌టి వ్యాఖ్య‌ల‌ను సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించిన అయ్య‌న్న‌.. కాసేప‌టి క్రితం అంబ‌టికి వార్నింగ్ ఇస్తూ ఓ ట్వీట్ చేశారు. "ఆడియోలో అడ్డంగా దొరికిపోయిన బ్రోకర్ నోరుమూసుకుని ఉండాలి. ఎగస్ట్రాలు చేస్తే ఇక వీడియోలే" అంటూ స‌ద‌రు ట్వీట్‌లో అంబటికి అయ్య‌న్న వార్నింగ్ ఇచ్చారు.