Chittoor District: నాటు తుపాకులు త‌యారు చేస్తున్న వ‌లంటీర్‌... అరెస్ట్ చేసిన పోలీసులు

  • చిత్తూరు జిల్లాలో ఘ‌ట‌న‌
  • కార్వేటి న‌గ‌రం చింత తోపు ఎస్టీ కాల‌నీ వ‌లంటీర్‌గా ర‌వి
  • సోదాల్లో రెండు తుపాకులు, త‌యారీ ప‌రిక‌రాల స్వాధీనం
గ్రామ వలంటీర్‌గా విధులు నిర్వ‌హిస్తున్న ఓ యువ‌కుడు నాటు తుపాకులు త‌యారు చేస్తూ పోలీసుల‌కు దొరికిపోయాడు. చిత్తూరు జిల్లా కార్వేటి న‌గ‌రంలో బుధ‌వారం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. కార్వేటి న‌గ‌రం ప‌రిధిలోని చింత‌తోపు ఎస్టీ కాల‌నీలో వలంటీర్‌గా ర‌వి అనే యువ‌కుడు ప‌ని చేస్తున్నాడు. అయితే, అత‌డు గుట్టుగా నాటు తుపాకులు త‌యారు చేస్తున్నాడు. దీనిపై ప‌క్కా స‌మాచారం అందుకున్న పోలీసులు బుధ‌వారం అత‌డి ఇంటిపై దాడి చేశారు. ఈ దాడిలో వలంటీర్ ర‌వి త‌యారు చేసిన రెండు నాటు తుపాకుల‌తో పాటు తుపాకుల త‌యారీకి వినియోగించే ప‌రిక‌రాల‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
Chittoor District
AP Police
Local Made Guns
Grama Valanteer

More Telugu News