P Narayana: నారాయణ నైతికంగా తప్పించుకోలేడు: విజ‌య‌సాయిరెడ్డి

  • సాంకేతికంగా నారాయ‌ణ‌కు బెయిల్‌
  • నారాయ‌ణ కుటుంబానికి చెందిన విద్యా సంస్థ నుంచే పేప‌ర్లు లీక్‌
  • ఈ వ్య‌వ‌హారంలో ఎవ‌రు ఓడారో ప్ర‌జ‌ల‌కు అర్థ‌మైంద‌న్న సాయిరెడ్డి
vijay sai reddy comments on bail to narayana

టెన్త్ క్వ‌శ్చ‌న్ పేపర్ల లీకేజీ కేసులో అరెస్టయిన టీడీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పొంగూరు నారాయ‌ణకు బెయిల్ మంజూరైన వ్య‌వ‌హారంపై వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తాజాగా స్పందించారు. సాంకేతిక కార‌ణాల‌ను చూపి బెయిల్ తెచ్చుకున్నా.. నైతికంగా మాత్రం నారాయ‌ణ త‌ప్పించుకోలేర‌ని సాయిరెడ్డి అభిప్రాయ‌ప‌డ్డారు. 

నారాయ‌ణ విద్యా సంస్థ‌ల చైర్ ప‌ర్స‌న్ హోదాలోనే నారాయ‌ణ‌ను అరెస్ట్ చేసిన‌ట్లు చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే 2014లోనే ఆ హోదా నుంచి నారాయ‌ణ త‌ప్పుకున్నారు. ఇదే విష‌యాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లిన నారాయ‌ణ బెయిల్ తెచ్చుకున్నారు.

నారాయ‌ణ‌కు బెయిల్ వ‌చ్చిన విష‌యంపై ట్విట్ట‌ర్ వేదిక‌గా స్పందించిన సాయిరెడ్డి... విద్యా సంస్థల ఛైర్మన్ పదవికి తానెప్పుడో రాజీనామా చేశానని చెప్పి బెయిలు తెచ్చుకున్నార‌ని తెలిపారు. సాంకేతికంగా నారాయ‌ణ‌ బయటపడి ఉండొచ్చున‌ని, అయితే నైతికంగా మాత్రం త‌ప్పించుకోలేర‌ని వ్యాఖ్యానించారు. నారాయ‌ణ కుటుంబానికి చెందిన సంస్థల్లో పేపర్లు బయటికొచ్చాయన్న సాయిరెడ్డి... ఈ వ్య‌వ‌హారంలో ఎవరు ఓడారో ప్రజలకు అర్థమైందని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.

More Telugu News