Rama Kuppam: చిత్తూరు జిల్లా రామకుప్పం ఎస్ఐ రివాల్వర్ మిస్సింగ్

Rama Kuppam SI Revolver missing
  • చంద్రబాబు పర్యటన సమయంలో బయటపడిన వ్యవహారం
  • ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ మధ్య నడుస్తున్న వివాదం
  • చర్యలకు సిద్ధమవుతున్న అధికారులు
ఏపీలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం ఎస్ఐ వెంకట శివకుమార్ రివాల్వర్ మిస్ అయింది. కుప్పంలో చంద్రబాబు పర్యటన ఉన్న సమయంలో ఈ మిస్సింగ్ వ్యవహారం బయటపడింది. అయితే రివాల్వర్ మిస్సింగ్ వ్యవహారంలో ఎస్సై, హెడ్ కానిస్టేబుల్ సుబ్రహ్మణ్యం మధ్య వివాదం నడుస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో హెడ్ కానిస్టేబుల్ కు రివాల్వర్ ఇచ్చినట్టు ఎస్ఐ చెపుతున్నారు. అయితే సర్వీసింగ్ తర్వాత రివాల్వర్ ను ఎస్ఐకి తిరిగి ఇచ్చేశానని హెడ్ కానిస్టేబుల్ చెపుతున్నారు. మరోవైపు ఈ విషయం గురించి తెలుసుకున్న అధికారులు చర్యలకు సిద్ధమవుతున్నారు.
Rama Kuppam
SI
Revolver
Missing

More Telugu News