Etela Rajender: రియలెస్టేట్ వ్యాపారం చేస్తూ కేసీఆర్ బ్రోకర్ లా మారారు: ఈటల రాజేందర్

KCR became like broker says Etela Rajender
  • ల్యాండ్ సీలింగ్ భూములపై కేసీఆర్ కన్ను పడిందన్న ఈటల 
  • ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములను లాక్కుంటున్నారని విమర్శ 
  • ధరణి వెబ్ సైట్ ప్రజల పట్ల శాపంగా మారిందని కామెంట్ 
టీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న భూదాన్, ల్యాండ్ సీలింగ్ భూములపై కేసీఆర్ కన్ను పడిందని అన్నారు. ల్యాండ్ పూలింగ్ పేరుతో భూములను లాక్కుంటూ, ప్రైవేట్ కంపెనీలకు అమ్ముకుంటూ ఈ ప్రభుత్వం బ్రోకర్ పని చేస్తోందని చెప్పారు. రియలెస్టేట్ వ్యాపారం చేస్తూ కేసీఆర్ బ్రోకర్ గా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. భూములు అమ్ముకున్న రైతులు కేసీఆర్ ఫామ్ హౌస్ ముందు వాచ్ మెన్లుగా పని చేస్తున్నారని చెప్పారు. ధరణి వెబ్ సైట్ ప్రజల పట్ల శాపంగా మారిందని అన్నారు.
Etela Rajender
BJP
KCR
TRS

More Telugu News