అసని తుపాను ప్రభావం చూపుతోన్న వేళ హై అలర్ట్‌గా ఉండాలని సీఎం జగన్ సూచనలు
- నిర్లక్ష్యానికి తావు లేకుండా పనిచేయాలన్న జగన్
- ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని సూచనలు
- ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశం
- పునరావాస శిబిరాలను తెరవాలని పేర్కొన్న సీఎం
ఏపీలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, అయితే, తుపాను బలహీనపడటం ఊరటనిచ్చే అంశమని చెప్పారు. అయినప్పటికీ నిర్లక్ష్యానికి తావు లేకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా చూడాలని ఆయన అన్నారు. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన ప్రాంతాల్లో పునరావాస శిబిరాలను తెరవాలని ఆయన చెప్పారు.
శిబిరాలకు తరలించిన కుటుంబాలకు ఆర్థిక సాయం కూడా చేయాలని ఆయన అన్నారు. ఒకవేళ కమ్యూనికేషన్ వ్యవస్థలో సమస్యలు ఏర్పడితే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన చెప్పారు. కాగా, పలువురు మంత్రులు కూడా అసని తుపాను ప్రభావంపై అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకుంటున్నారు.