Yuvraj Singh: వారి బ్యాటింగ్ శైలి నా ఆటను గుర్తు చేస్తోంది: యువరాజ్

He reminds me of myself a lot Felt I was very much like him Yuvraj
  • ఐపీఎల్ ఆటగాళ్లలో యువరాజ్ మెచ్చిన ఆ ఇద్దరు
  • ఒకరు సన్ రైజర్స్ ఓపెనర్ అభిషేక్ శర్మ
  • మరొకరు సీఎస్కే సభ్యుడు శివమ్ దూబే
  • దూబేకు తగిన అవకాశాలు ఇవ్వాలన్న యువరాజ్
ప్రముఖ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ప్రస్తుత ఐపీఎల్ సీజన్ లో తన మాదిరిగా బ్యాటింగ్ శైలి చూపిస్తున్న ఇద్దరు ఆటగాళ్ల వివరాలను మీడియాతో పంచుకున్నాడు. సన్ రైజర్స్ జట్టు ఓపెనర్ గా సేవలు అందిస్తున్న అభిషేక్ శర్మ కూడా యువరాజ్ వెల్లడించిన పేర్లలో ఒకటి.

‘‘అభిషేక్ శర్మ నన్ను నేను గుర్తు చేసుకునేలా చేస్తున్నాడు. అతని పుల్ షాట్, బ్యాక్ ఫూట్ షాట్ చూస్తుంటే ఎంతో ముచ్చట వేస్తోంది’’ అని యువరాజ్ పేర్కొన్నాడు. ఈ సీజన్ లో అభిషేక్ శర్మ సన్ రైజర్స్ జట్టుకు కీలక ఆటగాళ్లలో ఒకడిగా మారిపోయి, మంచిగా రాణిస్తుండడం చూస్తూనే ఉన్నాం. 331 పరుగులతో ప్రస్తుత సీజన్ లో జట్టు తరఫున ఎక్కువ స్కోరు అభిషేక్ శర్మ పేరిటే ఉంది.

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆటగాడు శివమ్ దూబే సైతం తన మాదిరే ఆడుతున్నట్టు యువరాజ్ సింగ్ వెల్లడించాడు. అంతర్జాతీయ స్థాయిలో దూబేకు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని అభిప్రాయపడ్డాడు. దూబే సీఎస్కే కోసం ఈ సీజన్ లో 9 మ్యాచ్ లు ఆడాడు. 279 పరుగులు చేశాడు. 

‘‘శివమ్ దూబేకు కూడా అదే స్టయిల్ ఉంది. అతడు ఎంతో కాలంగా పరిశ్రమలో ఉన్నాడు. 28 ఏళ్ల వ్యక్తి. కానీ, వన్డే అంతర్జాతీయ మ్యాచ్ లు ఎన్ని ఆడాడో కూడా గుర్తులేదు. అలాంటి వ్యక్తుల్లో మంచి ప్రతిభ ఉందని భావించినప్పుడు మరిన్ని అవకాశాలు ఇచ్చి చూడాలి. అప్పుడే వారిని మరింత మెరుగ్గా తయారు చేయవచ్చు’’ అని యువరాజ్ తెలిపాడు.
Yuvraj Singh
liked
players
IPL
sivam dubay
abhishek sharma

More Telugu News