Pakistan: సరిహద్దుల్లో పాక్ డ్రోన్ కేంద్రాలు.. ఆయుధాలు, డ్రగ్స్ చేరవేత

Pakistans ISI sets up drone centres to send arms drugs into India
  • ఇప్పటికే ఆరు కేంద్రాల ఏర్పాటు
  • పాక్ సైన్యం సహకారంతో ఐఎస్ఐ కార్యకలాపాలు
  • బీఎస్ఎఫ్ ను హెచ్చరించిన ఇంటెలిజెన్స్
  • కనిపిస్తే కూల్చేసేందుకు యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ఏర్పాటు
భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ డ్రోన్ కేంద్రాలు ఏర్పాటు చేస్తోంది. అక్కడి నుంచి డ్రోన్ల ద్వారా భారత్ లోకి డ్రగ్స్, ఆయుధాలు పంపించాలన్నది పాకిస్థాన్ ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్ (ఐఎస్ఐ/గూఢచార సంస్థ) పన్నాగం. పాకిస్థాన్ రేంజర్స్ సమన్వయంతో ఇప్పటికే ఆరు డ్రోన్ కేంద్రాలను ఐఎస్ఐ ఏర్పాటు చేసింది.

పంజాబ్ పక్కన అంతర్జాతీయ సరిహద్దుకు సమీపంలో స్మగ్లర్లు, ఉగ్రవాదుల సాయంతో డ్రోన్ కేంద్రాలను ఐఎస్ఐ నిర్వహిస్తోంది. ఫిరోజ్ పూర్ నుంచి అమృత్ సర్ వరకు సరిహద్దు సమీపంలోని పోస్ట్ ల వద్ద పాకిస్థాన్ డ్రోన్ల కార్యకలాపాలపై తమకు ఇంటెలిజెన్స్ నుంచి సమాచారం అందినట్టు సరిహద్దు భధ్రతా దళం (బీఎస్ఎఫ్) వర్గాలు వెల్లడించాయి. 

‘‘ఆయుధాలు, డ్రగ్స్, పేలుడు పదార్థాల సరఫరా కోసం డ్రోన్లను పాకిస్థాన్ వినియోగిస్తోంది. సరిహద్దు బలగాల సహకారంతో డ్రోన్లను భారత్ లోకి పంపిస్తోంది’’ అని ఆ వర్గాలు వెల్లడించాయి. ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో బీఎస్ఎఫ్ యాంటీ డ్రోన్ సిస్టమ్స్ ను ఏర్పాటు చేసుకుంటోంది. డ్రోన్లు కనిపించిన వెంటనే కూల్చివేసేందుకు సిద్ధమైంది. 

సరిహద్దుకు సమీపంలో ఈ ఏడాది ఇప్పటి వరకు 53 డ్రోన్ల చొరబాట్లను బలగాలు గుర్తించాయి. గత మూడేళ్లలో పంజాబ్ సరిహద్దుల్లో బీఎస్ఎఫ్ దళాలు 1,150 కిలోల డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నాయి.
Pakistan
drone
drugs
arms
explosives

More Telugu News