Inter Exams: దిశ మార్చుకున్న అసని... ఏపీలో రేపటి ఇంటర్ పరీక్ష వాయిదా

AP Govt postponed Inter exams due to Asani cyclone
  • మచిలీపట్నం దిశగా వస్తున్న 'అసని' తుపాను
  • ఇక్కడే తీరం దాటే అవకాశం
  • రేపటి పరీక్షను ఈ నెల 25న నిర్వహిస్తామన్న ప్రభుత్వం
ఏపీలో రేపు జరగాల్సిన ఇంటర్ పరీక్ష వాయిదా పడింది. తీవ్ర తుపాను 'అసని' దిశ మార్చుకుని రాష్ట్రం వైపు వస్తుండడంతో ప్రభుత్వం రేపటి పరీక్షను వాయిదా వేసింది. ఇక రేపటి ఇంటర్ పరీక్షను మే 25న జరుపుతామని ఇంటర్ బోర్డు వెల్లడించింది. 

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అసని తుపాను పశ్చిమ వాయవ్య దిశగా పయనించి, ఉత్తర కోస్తాంధ్ర, ఒడిశా తీరాలను తాకుతూ పశ్చిమ బెంగాల్ వైపు వెళుతుందని తొలుత అంచనా వేశారు. అయితే, అసని దిశ మార్చుకుని మచిలీపట్నం వైపు మరలడంతో ఏపీ సర్కారు అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలోనే రేపటి ఇంటర్ పరీక్షను వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Inter Exams
Postpone
Asani
Andhra Pradesh

More Telugu News