YSRCP: కృష్ణా జిల్లా ఇంచార్జీ మంత్రిగా ఆర్కే రోజా... ఎదురుగా మాజీ మంత్రులు కొడాలి, పేర్ని

krishna district incharge minister meets exministers kodali nani and perni nani
  • ఇటీవ‌లే మంత్రి ప‌ద‌వులు కోల్పోయిన కొడాలి, పేర్ని
  • మంత్రి ప‌ద‌వితో పాటు కృష్ణా జిల్లా ఇంచార్జీ మంత్రిగా ఆర్కే రోజా
  • మ‌చిలీప‌ట్నం భేటీలో ఆక‌ట్టుకున్న వీరి ఫొటో
కృష్ణా జిల్లా కేంద్రం మ‌చిలీప‌ట్నంలో మంగ‌ళ‌వారం ఓ ఆస‌క్తిక‌ర స‌న్నివేశం క‌నిపించింది. ఏపీ మంత్రివ‌ర్గ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణలో చిత్తూరు జిల్లా న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్కే రోజాకు మంత్రి ప‌ద‌వి ద‌క్క‌గా... అప్ప‌టిదాకా మంత్రులుగా ప‌ద‌వుల్లో కొన‌సాగిన కొడాలి శ్రీవెంక‌టేశ్వ‌ర‌రావు (కొడాలి నాని), పేర్ని వెంక‌ట్రామ‌య్య (పేర్ని నాని)లు మంత్రి ప‌ద‌వులు కోల్పోయారు. అదే స‌మ‌యంలో కృష్ణా జిల్లా ఇంచార్జీ మంత్రిగా రోజా ఎంపిక‌య్యారు. 

తాజాగా కృష్ణా జిల్లా ఇంచార్జీ మంత్రి హోదాతో రోజా మ‌చిలీప‌ట్నం రాగా... ఆమె ఎదురుగా మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు కూర్చున్నారు. ఈ స‌మావేశంలో జిల్లా నుంచి కొత్త‌గా మంత్రి ప‌ద‌వి చేప‌ట్టిన జోగి ర‌మేశ్ కూడా పాలుపంచుకున్నా... ఆయ‌న రోజాకు ఓ వైపున ఆమెకు కాస్తంత వెనుకాల కూర్చున్నారు. ఈ నేప‌థ్యంలో జిల్లా కొత్త ఇంచార్జీ మంత్రి రోజా ఎదుట ఇద్ద‌రు మాజీ మంత్రులు కొడాలి నాని, పేర్ని నానిలు కూర్చున్న దృశ్యం ప‌లువురిని ఆక‌ట్టుకుంది.
YSRCP
Roja
Kodali Nani
Perni Nani
Jogi Ramesh
Krishna District

More Telugu News