నారాయణ పక్కా బిజెనెన్ మేన్: అంబటి రాంబాబు

  • పరీక్షా పత్రాల లీక్ కేసులో అరెస్ట్ అయిన నారాయణ
  • నారాయణ పాత్ర ఉన్నట్టు ప్రాథమికంగా నిర్ధారణ అయిందన్న అంబటి
  • నారాయణ కాలేజీలో పేపర్ లీక్ అయిందని వ్యాఖ్య
Narayana is a business man says Ambati Rambabu

పదో తరగతి పరీక్షల ప్రశ్నాపత్రాలు లీక్ అయిన ఘటనలో నారాయణ విద్యా సంస్థల అధినేత, మాజీ మంత్రి నారాయణను ఏపీ పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. నారాయణను హైదరాబాద్ నుంచి చిత్తూరుకు తరలిస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీపై టీడీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ చేయించారని మండిపడ్డారు.

ఈ క్రమంలో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ, నారాయణ పక్కా బిజినెస్ మేన్ అని చెప్పారు. పేపర్ లీకేజీలో నారాయణ పాత్ర ఉన్నట్టు విచారణలో ప్రాథమికంగా నిర్ధారించారని అన్నారు. నారాయణ కాలేజీలో పేపర్ లీక్ అయిందని చెప్పారు. పేపర్ లీక్ చేసి డబ్బులు సంపాదిస్తున్నారని అన్నారు.

More Telugu News