తల్లి కాబోతున్న నమిత

  • తాను గర్భవతినని వెల్లడించిన నమిత
  • బేబీ బంప్ తో ఉన్న ఫొటోను షేర్ చేసిన వైనం
  • కొత్త అనుభూతి కలుగుతోందని వ్యాఖ్య
Actress Namitha is pregnant

సినీ హీరోయిన్ నమిత తల్లి కాబోతోంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ప్రకటించింది. తాను గర్భవతినని తెలిపింది. బేబీ బంప్ తో ఉన్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈరోజు తన పుట్టినరోజు సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించింది. తన జీవితంలో కొత్త అధ్యాయం మొదలైందని తెలిపింది. తనలో ఎంతో మార్పు వచ్చిందని చెప్పింది. మాతృత్వపు అనుభూతి కోసం ఎన్నో రోజులుగా ఎదురు చూశానని... కడుపులో ఉన్న చిన్నారి కదులుతుంటే కొత్త అనుభూతి కలుగుతోందని తెలిపింది. ఇంతకు ముందు ఎప్పుడూ లేని ఫీలింగ్ కలుగుతోందని చెప్పింది. 

తెలుగులో ఎన్నో చిత్రాలలో నటించిన నమిత... ఆ తర్వాత తమిళ పరిశ్రమలో స్థిరపడిపోయింది. తెలుగు కంటే కూడా తమిళంలోనే ఎక్కువ చిత్రాలు చేసింది. తమిళ అభిమానులు ఆమెకు గుడి కూడా కట్టారు. ఆఫర్లు కొంచెం తగ్గిన తర్వాత వీరేంద్ర చౌదరిని ఆమె పెళ్లాడింది.

More Telugu News