Kieron Pollard: అంపైర్ ను కంగారు పెట్టిన కీరన్ పొలార్డ్

Kieron Pollard accidentally hits umpire while bowling during MI vs KKR game Rohit Sharma left in splits
  • పదో ఓవర్ బౌలింగ్ చేస్తుండగా చేతి నుంచి జారిపోయిన బాల్
  • అంపైర్ ను తాకిన బంతి
  • ఆయన పక్కకు జరిగిన వైనం
  • సారీ చెప్పిన పొలార్డ్
ముంబై ఇండియన్స్ జట్టు సభ్యుడు కీరన్ పొలార్డ్ బౌలింగ్ అంపైర్ ను కంగారు పెట్టించింది. సోమవారం కోల్ కతా నైట్ రైడర్స్ , ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ ను పొలార్డ్ తీసుకున్నాడు. ఈ సందర్భంగా పొలార్డ్ పరుగెత్తుకుంటూ వచ్చి బంతిని సంధించగా.. అది చేతి నుంచి జారిపోయి వెనుకనున్న అంపైర్ ను తాకింది. 

దీంతో అంపైర్ వెంటనే పక్కకు జరగడం వీడియోలో కనిపించింది. అనంతరం సారీ అంటూ అంపైర్ కు పొలార్డ్ క్షమాపణలు చెప్పాడు. చేతి నుంచి జారి రావడంతో అంపైర్ కు గాయం కాలేదు. పొలార్డ్ సారీ చెబుతుంటే.. అంపైర్ నవ్వడం చూసే వారికి కూడా నవ్వు తెప్పించింది. ఆటలో భాగంగా అప్పుడప్పుడు ఈ తరహా సందర్భాలు కనిపిస్తూ ఉంటాయి. నిన్నటి మ్యాచులో ముంబై ఇండియన్స్ పై కేకేఆర్ ఘన విజయం సాధించడం తెలిసిందే.
Kieron Pollard
umpire
ball
slipped

More Telugu News