Mahesh Babu: తన తండ్రి బయోపిక్ పై మహేశ్ బాబు స్పందన

Mahesh Babu says he will never do his father biopic
  • మేజర్ చిత్రం ట్రైలర్ రిలీజ్ చేసిన మహేశ్ బాబు
  • కృష్ణ బయోపిక్ పై ప్రశ్నించిన మీడియా
  • తానైతే తీయలేనని వెల్లడి
  • ఎవరైనా తీస్తే సంతోషంగా చూస్తానని వివరణ
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించడం తెలిసిందే. తన పేరిట జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ స్థాపించి పలు చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకుంటున్నారు. తాజాగా, జీఎంబీ బ్యానర్ పై తెరకెక్కిన మేజర్ చిత్రం ట్రైలర్ ను మహేశ్ బాబు ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా ఆయన మీడియాతో ముచ్చటించారు. తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ బయోపిక్ పై స్పందించారు. ఆయన బయోపిక్ ఎవరైనా తీస్తే సంతోషంగా చూస్తానే తప్ప, తానైతే చేయలేనని స్పష్టం చేశారు. ఆయన తనకు దేవుడు అని వ్యాఖ్యానించారు. తాను గతంలో కూడా ఇదే చెప్పానని అన్నారు. 

ఇక, మేజర్ చిత్రం గురించి చెబుతూ, నిన్ననే ఆ సినిమా చూశానని మహేశ్ బాబు వెల్లడించారు. ఆఖరి అరగంట రోమాలు నిక్కబొడుచుకునేలా ఉందని అన్నారు. మేజర్ చిత్రంలో భాగమైనందుకు ఈ చిత్రయూనిట్ సభ్యులు గత రెండేళ్లుగా తనకు కృతజ్ఞతలు చెబుతున్నారని, కానీ ఇంత మంచి చిత్రం తీసినందుకు తానే వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నానని మహేశ్ పేర్కొన్నారు.
Mahesh Babu
Krishna
Biopic
Major
Tollywood

More Telugu News