TSSPDCL: తెలంగాణ‌లో మ‌రో 1,271 ఉద్యోగాల భ‌ర్తీకి ప్ర‌క‌ట‌న‌

another notifications issued in telangana for filling up 1271 posts
  • టీఎస్ఎస్‌పీడీసీఎల్‌లోని ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్‌
  • లైన‌మ‌న్ ఉద్యోగాలు 1,000
  • ఈ నెల 11 నుంచి ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తులు
తెలంగాణ‌లో ఉద్యోగాల భ‌ర్తీకి వ‌రుస‌గా నోటిఫికేష‌న్‌లు జారీ అవుతున్నాయి. ఇందులో భాగంగా సోమ‌వారం తెలంగాణ స్టేట్ స‌ద‌ర‌న్ ప‌వ‌ర్ డిస్ట్రిబ్యూష‌న్ కార్పొరేష‌న్ లిమిటెడ్ (టీఎస్ఎస్‌పీడీసీఎల్‌) లో ఖాళీగా ఉన్న 1,271 ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయ్యింది. తెలంగాణ విద్యుత్ శాఖకు సంబంధించి విద్యుత్ స‌ర‌ఫ‌రాలో టీఎస్ఎస్‌పీడీసీఎల్ ఓ విభాగంగా ఉన్న సంగ‌తి తెలిసిందే.

తాజా నోటిఫికేష‌న్‌లో టీఎస్ఎస్‌పీడీసీఎల్‌లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్లు (ఎల‌క్ట్రిక‌ల్‌) పోస్టులు 70, స‌బ్ ఇంజినీర్ (ఎల‌క్ట్రిక‌ల్‌) 201, జూనియ‌ర్ లైన్‌మ‌న్ విభాగంలోని 1,000 ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. ఈ నెల 11 నుంచి ఆన్‌లైన్లో ద‌ర‌ఖాస్తులు చేసుకోవాల్సిందిగా ఆ నోటిఫికేష‌న్‌లో పేర్కొన్నారు.
TSSPDCL
Telangana
Job Notificarion

More Telugu News