తెలంగాణలో టికెట్ల ధరలు పెంచుకునేందుకు 'సర్కారు వారి పాట'కు అనుమతి

09-05-2022 Mon 16:02 | Telangana
  • మహేశ్ బాబు హీరోగా సర్కారు వారి పాట
  • ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్
  • టికెట్ల ధరలపై ఉత్తర్వులు జారీ
  • అదనపు షోలకు కూడా అనుమతి
Telangana govt allows to hike ticket prices for Sarkaaru Vaari Pata
మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో వస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో, తెలంగాణలో టికెట్ల ధరలు పెంచుకునేందుకు 'సర్కారు వారి పాట' చిత్రానికి అనుమతి లభించింది. 

మల్టీ ప్లెక్స్ లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలపై రూ.50 పెంచుకునేందుకు అనుమతించారు. ఎయిర్ కండిషన్డ్, ఎయిర్ కూల్డ్ థియేటర్లలో టికెట్ ధరపై రూ.30 పెరగనుంది. అంతేకాదు, 'సర్కారు వారి పాట' చిత్రం అదనపు ప్రదర్శనలకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ అయ్యాయి. 'సర్కారు వారి పాట' చిత్రానికి టికెట్ల ధరలు పెంచుకునేందుకు అటు ఏపీలోనూ అనుమతి లభించడం తెలిసిందే.
.