Kohli: గోల్డెన్ డకౌట్ తర్వాత కోహ్లీ ముఖకవళికలు .. వీడియో ఇదిగో!

Kohli shakes his head in disbelief after third golden duck of IPL 2022
  • ఐపీఎల్ 2022 సీజన్ లో మూడు గోల్డెన్ డకౌట్లు
  • తొలి బంతికే ముగిసిన కోహ్లీ కథ 
  • డగౌట్స్ లో కూర్చుని నవ్వుతున్న కోహ్లీ
ఆర్సీబీ మాజీ కెప్టెన్, ప్రస్తుత సభ్యుడు అయిన విరాట్ కోహ్లీ తన పేలవ పనితీరును కొనసాగిస్తున్నాడు. ఈ సీజన్ లో మూడో గోల్డెన్ డకౌట్ నమోదు చేశాడు. బ్యాట్స్ మ్యాన్ మొదటి బంతికే అవుట్ కావడాన్ని గోల్డెన్ డకౌట్ గా చెబుతారు. ఈ విషయంలో కోహ్లీ రికార్డులు సృష్టిస్తున్నాడు. ఆదివారం సన్ రైజర్స్ తో జరిగిన మ్యాచ్ లో మొదటి బంతికే కోహ్లీ పెవిలియన్ బాట పట్టాడు.

ఆ తర్వాత డగౌట్స్ లో కూర్చొని కోహ్లీ తనలో తానే వెర్రి నవ్వు నవ్వుకోవడం కెమెరాల్లో రికార్డు అయింది. కోహ్లీ తాను అవుట్ అయిన తీరుపై తనకు తానే సిగ్గుపడుతున్నట్టు ముఖ కవళికలు చెబుతున్నాయి. కోహ్లీ వికెట్ ను జగదీశ సుచిత్ తీశాడు. ఈ సీజన్ లో కోహ్లీ మరీ దారుణమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. 12 మ్యాచులకు గాను అతడు చేసిన స్కోరు 216 పరుగులు మాత్రమే. కెప్టెన్ గా తప్పుకున్నా.. అతడి ఆట కుదురుకోలేదని తెలుస్తోంది.
Kohli
golden duck
smile
IPL 2022

More Telugu News