MS Dhoni: బౌండరీలు బాదు.. వికెట్ల మధ్య నన్ను పరుగెత్తించకు.. ధోనీతో బ్రావో

  • చివరి ఓవర్లో బ్రావో, ధోనీ బ్యాటింగ్
  • సింగిల్ తీసి ధోనీకి స్ట్రయిక్ ఇచ్చిన బ్రావో
  • రెండు సార్లు రెండేసి పరుగులు చేసిన ధోనీ
  • సరదా సంభాషణ బయటపెట్టిన బ్రావో  
Told MS Dhoni to hit boundaries not push me for twos Dwayne Bravo jokes

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యుడైన డ్వేన్ బ్రావో, కెప్టెన్ ధోనీ మధ్య మంచి స్నేహ బంధం ఉంది. అందుకే ధోనీతో బ్రావో ఎప్పుడూ సెటైర్లు వేస్తుంటాడు. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్ పై సీఎస్కే ఘన విజయం నమోదు చేసిన తర్వాత బ్రావో మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా ఆసక్తికరమైన సంభాషణ గురించి తెలియజేశాడు.

చివరి ఓవర్లో బ్రావో బ్యాట్ పట్టుకుని రావాల్సి వచ్చింది. అనిరిచ్ నార్జే వేసిన మొదటి మూడు బంతులను ఎదుర్కొన్న బ్రావో సింగిల్ తీసి ధోనీకి స్ట్రయిక్ ఇచ్చాడు. ధోనీ అప్పటికే బ్యాటుతో వీర విహారం చేస్తున్నాడు. రెండు సిక్స్ లు, ఒక బౌండరీ బాది మంచి ఊపు మీద ఉన్నాడు. బ్రావో నుంచి స్ట్రయిక్ అందుకున్న ధోనీ బాల్ ను గట్టిగా కొట్టి రెండు పరుగులు తీశాడు. 

ఈ సందర్భంగా బ్రావో ధోనీని.. ‘‘సామీ నువ్వు కావాలంటే బౌండరీలు బాదు.. నన్ను మాత్రం వికెట్ల మధ్య పరుగెత్తించకయ్యా?’’అని వేడుకున్నాడట. అయినా సరే తర్వాతి బంతికి కూడా రెండు పరుగులు చేసిన ధోనీ జట్టు స్కోరును 208కి చేర్చాడు. 

మ్యాచ్ అనంతరం ఈ సరదా సంభాషణ గురించి బ్రావో మీడియాకు తెలిపాడు. తాము గొప్ప ప్రొఫెషనల్ టీమ్ మాదిరి ఆడినట్టు బ్రావో చెప్పాడు. రుతురాజ్, కాన్వే మంచి ఓపెనింగ్ ఇచ్చినట్టు పేర్కొన్నాడు. అలాగే, బాల్ తో కూడా మంచి ఫినిషింగ్ ఇచ్చినట్టు గుర్తు చేశాడు. 39 ఏళ్ల వయసులోనూ బ్రావో ఈ సీజన్ లో బాగానే రాణిస్తున్నాడు. 16 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు.

More Telugu News