Somireddy Chandra Mohan Reddy: మీతో పొత్తు పెట్టుకునేందుకు ఏ రాజకీయ పార్టీ సిద్ధంగా లేదు: సోమిరెడ్డి 

No party is willing to join hands with YSRCP says Somireddy Chandra Mohan Reddy
  • ఏపీలో వేడెక్కుతున్న రాజకీయం
  • టీడీపీతో జనసేన కలవబోతోందంటూ ప్రచారం
  • అధికార, విపక్షాల మధ్య విమర్శల యుద్ధం
ఏపీలో అప్పుడే ఎన్నికల సందడి నెలకొంది. ఎన్నికలకు ముందు వినిపించే, కనిపించే పొత్తుల వ్యవహారం అప్పుడే తెరపైకి వచ్చింది. దాదాపు అన్ని పార్టీల నేతలు పొత్తుల గురించే మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన మళ్లీ చేతులు కలపబోతున్నాయనే సంకేతాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.

 ఈ నేపథ్యంలో ఈ రెండు పార్టీలపై వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. పొత్తులు లేకుండా చంద్రబాబు ఎన్నికలకు వెళ్లలేరంటూ ఎద్దేవా చేస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు, పవన్ కల్యాణ్ ల మధ్య అనైతిక కలయిక ఉందని విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

ట్విట్టర్ వేదికగా సోమిరెడ్డి స్పందిస్తూ వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అవినీతి, అరాచకాల కంపు కొట్టే మీ పక్కన నిలబడేందుకు ఏ రాజకీయ పార్టీ కూడా ఇష్టపడదని అన్నారు. మీరు ఎవరితోనూ పొత్తు పెట్టుకోకపోవడం కాదు... మీతో చేయి కలిపేందుకు ఏ పార్టీ సిద్ధంగా లేదని చెప్పారు. గోదావరిలో కొట్టుకుపోతున్న గ్రామసింహం తోకను ఎవరూ పట్టుకోరనే నిజాన్ని కప్పిపెట్టి... సింహంలాగ సింగిల్ గా వస్తామంటూ గొప్పలు చెప్పుకోవడం చూసి జనాలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Somireddy Chandra Mohan Reddy
Telugudesam
Janasena
YSRCP

More Telugu News