Rupeeౌ: కొత్త కనిష్ఠానికి పడిపోయిన రూపాయి

  • ఫారెక్స్ మార్కెట్లో 77.18కి క్షీణత
  • ముడి చమురు ధరల పెరుగుదల ప్రభావం
  • పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్న విదేశీ ఇన్వెస్టర్లు
Rupee hits record low of 77 18 against US dollar as broad risk off sweeps Asia

డాలర్ మారకంలో రూపాయి కొత్త కనిష్ఠ స్థాయికి పడిపోయింది. విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి అదే పనిగా పెట్టుబడులను వెనక్కి తీసుకుంటూ ఉండడం మన కరెన్సీ విలువను ప్రభావితం చేస్తోంది. సోమవారం ఉదయం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ 0.3 శాతం వరకు క్షీణించి 77.18కి పడిపోయింది. గత కనిష్ఠ స్థాయి 76.98 నుంచి దిగిపోయింది.

విదేశీ  పెట్టుబడిదారులు భారత ఈక్విటీల నుంచి ఈ ఏడాది 17.7 బిలియన్ డాలర్లను (బిలియన్ డాలర్ సుమారు రూ.7,500 కోట్లు) వెనక్కి తీసుకున్నారు. ఇంత భారీ మొత్తంలో వారు వెనక్కి తీసుకున్నది గతంలో ఎప్పుడూ లేదు. అంతర్జాతీయంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతూ ఉండడం (ఆర్బీఐ, ఫెడ్ సహా)తో.. విదేశీ ఇన్వెస్టర్లు రిస్క్ తో కూడిన ఈక్విటీల నుంచి పెట్టుబడులను డెట్ సాధనాల వైపు మళ్లిస్తున్నారు. 

అలాగే, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగుండడం తెలిసిందే. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం సమసిపోకపోవడం, కమోడిటీల ధరలు, ద్రవ్యోల్బణం గరిష్ఠ స్థాయులకు చేరుకోవడం రూపాయి విలువను తగ్గించేస్తున్నాయి. ఇక ముడి చమురు ధరల పెరుగుదల వల్ల కరెంటు ఖాతా లోటు విస్తరించడం, ఆర్బీఐ 0.40 శాతం మేర రెపో రేను పెంచడం కూడా రూపాయిపై ప్రభావం చూపించే అంశాలే. 85 శాతం ముడి చమురు అవసరాలను దిగుమతులే తీరుస్తుండడం గమనించాలి. 

More Telugu News