KA Paul: రాహుల్ గాంధీ వాగ్దానాలు వింటే నవ్వొస్తోంది: కేఏ పాల్

KA Paul comments on Congress party and Rahul Gandhi
  • వరంగల్ సభలో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్
  • స్పందించిన కేఏ పాల్
  • కాంగ్రెస్ మాయమాటలను ప్రజలు నమ్మరని వెల్లడి
వరంగల్ లో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ పై ప్రజాశాంతి పార్టీ అధినేత, ప్రముఖ శాంతి ప్రబోధకుడు కేఏ పాల్ స్పందించారు. దేశాన్ని భ్రష్టుపట్టించింది కాంగ్రెస్ పార్టీయేనని అన్నారు. రాహుల్ గాంధీ వాగ్దానాలు వింటుంటే నవ్వొస్తోందన్నారు. కాంగ్రెస్ మాయమాటలను ప్రజలు విశ్వసించబోరని, రాహుల్ చెప్పిన అంశాలను కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడంలేదని ప్రశ్నించారు. 

ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీ గత 70 ఏళ్లలో ఏనాడైనా పంటలకు గిట్టుబాటు ధర ఇచ్చిందా? అని నిలదీశారు. దేశాన్ని, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ అందుకు తగిన శిక్ష అనుభవిస్తోందని, ఇప్పుడు తెలంగాణ ప్రజలను మోసం చేయడం కోసమే తాజా వాగ్దానాలు చేస్తోందని కేఏ పాల్ విమర్శించారు.
KA Paul
Rahul Gandhi
Congress
Warangal Declaration

More Telugu News