face mask: ‘మాస్క్’ ధారణతో ప్రయోజనాలే ఎక్కువ అంటున్న వైద్యులు

Is face mask wearing amid Covid19 pandemic beneficial or causing any harm
  • శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తలనొప్పులు
  • ఈ తరహా చిన్న చిన్న ఇబ్బందులు సహజం
  • వీటితో పోలిస్తే ప్రయోజనాలు ఎక్కువ
  • వైరస్, గాలి ద్వారా వ్యాపించే వ్యాధులకు చెక్
ఫేస్ మాస్క్ ధారణ పట్ల అవగాహన ప్రజల్లో  కరోనా తర్వాత ఏర్పడిందని చెప్పుకోవాలి. నాణ్యమైన మాస్క్ లు ధరించడం ద్వారా ఎన్నో రకాల వైరస్, ధూళి కణాల నుంచి రక్షణ లభిస్తుందన్నది వైద్యుల సూచన. కానీ, అదే సమయంలో మాస్క్ ను ఎక్కువ సమయం పాటు ధరించడం వల్ల సమస్యలు వస్తాయని చెప్పేవారు కూడా ఉన్నారు.

మాస్క్ ను ధరించడం ఆరోగ్యకరమైన అలవాటుగా వైద్యులు పేర్కొంటున్నారు. ఒక్క కరోనా వైరస్ నుంచే కాకుండా.. వైరల్ ఇన్ఫెక్షన్లు, గాలి ద్వారా వ్యాపించే టీబీ లాంటి వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుందని చెబుతున్నారు. రద్దీ ప్రాంతాలు, బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ ధరించడం వల్ల ప్రయోజనాలు ఉంటాయంటున్నారు.

‘‘మాస్క్ లు ధరించడం వల్ల ప్రయోజనాల కంటే నష్టాలు ఏక్కువ ఉన్నాయని అనిపించొచ్చు. ఏ విషయంలో అయినా లాభ, నష్టాలు ఉంటాయి. మనల్ని మనం సరిగ్గా రక్షించుకుంటే, ఇతరులను కూడా రక్షించుకోవచ్చు. మాస్క్ ధరించడం వల్ల వచ్చే ప్రతికూలతల గురించి విని ఉంటారు. శ్వాస తీసుకోవడం కష్టమవుతుందని, వినడానికి కూడా ఇబ్బందిగా ఉందని, కళ్లద్దాలపై పొగ చేరుతోందని ఇలా ఎన్నో చెబుతారు. వీటితో మేము అంగీకరిస్తాము. కానీ, కరోనా మహమ్మారి వంటి ప్రస్తుత పరిస్థితుల్లో ధరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు చూడాలి’’అని ముంబై పారెల్ గ్లోబల్ హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ హరీష్ చాఫ్లే తెలిపారు.

మసీనా హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ సుశీల్ జైన్ కూడా ఇదే విధమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇన్ఫెక్షన్ కు కారణమయ్యే వైరస్ ల వ్యాప్తిని అడ్డుకోవచ్చన్నారు. ట్యూబర్ క్యూలోసిస్ (టీబీ), ఇన్ ఫ్లూయంగా వంటి వాటి వ్యాప్తిని నివారించొచ్చని సూచించారు. చేతుల పరిశుభ్రత, కళ్లు, ముక్కు, నోటిని ముట్టుకోకుండా ఉండే మంచి అలవాట్లకు దారితీస్తుందన్నారు. 

మాస్కులతో ప్రతికూలతలపై డాక్టర్ సుశీల్ జైన్ మాట్లాడుతూ.. ‘‘తలనొప్పి, శ్వాస పరమైన సమస్యలు (వాడిన మాస్క్ ను బట్టి), ముఖ చర్మంపై మచ్చలు, చికాకు కలిగించే చర్మ వ్యాధులు వంటివి కనిపించొచ్చు. అలాగే, చిన్నారుల్లో మాస్క్ ధారణ కష్టతరం కావొచ్చు. చాలా వేడి, తేమతో కూడిన ప్రాంతాల్లో మాస్క్ ధారణ కష్టంగా అనిపించొచ్చు‘‘అని చెప్పారు. 

ఆస్తమా ఉన్న వారు మాస్క్ ధరించడం వల్ల వ్యాధి తీవ్రత పెరుగుతుందని చెప్పడానికి ఆధారాల్లేవని అమెరికన్ అకాడమీ ఆఫ్ అలెర్జీ, ఆస్తమా అండ్ ఇమ్యునాలజీ సైతం ప్రకటించింది. మాస్క్ ధారణ ఆక్సిజన్ శాచురేషన్ పై ప్రభావం చూపించదని తాజా అధ్యయనం కూడా ఒకటి గుర్తించింది.
face mask
wearing
benefits
health
experts

More Telugu News