Ravela Kishore Babu: ఎక్కువ వ్యాట్ క‌లిగిన‌ రాష్ట్రాల్లో తెలంగాణ ఒక‌టన్న కిష‌న్ రెడ్డి.. సోష‌ల్ మీడియాలో ట్వీట్ వార్

  • తెలంగాణ‌లో వ్యాట్‌పై కిష‌న్ రెడ్డి ట్వీట్‌
  • ఏడేళ్ల‌లో రూ.56 వేల కోట్లు ఆర్జించింద‌న్న కేంద్ర మంత్రి
  • టీఆర్ఎస్ స‌పోర్ట‌ర్ నుంచి దూసుకొచ్చిన రీ ట్వీట్‌
  • తెలంగాణ పెంచ‌లేద‌ని, కేంద్ర‌మే పెంచిందంటూ ఆరోప‌ణ‌
tweet war between bjp and trs cadre over kishan reddy tweet

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల విష‌యంలో రాష్ట్రాల ప‌న్ను వ‌సూళ్ల కార‌ణంగానే ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని కేంద్రంలోని న‌రేంద్ర మోదీ స‌ర్కారు చెబుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో తెలంగాణ‌కు చెందిన కేంద్ర మంత్రి కిష‌న్ రెడ్డి శ‌నివారం నాడు పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల‌కు సంబంధించి ఓ ట్వీట్ చేశారు. పెట్రోల్‌, డీజిల్ ల‌పై అత్య‌ధిక వ్యాట్‌ను వ‌సూలు చేస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒక‌టి అంటూ ఆయ‌న ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌తో ఇప్పుడు సోష‌ల్ మీడియాలో బీజేపీ వ‌ర్సెస్ టీఆర్ఎస్ యుద్ధం మొద‌లైంది. కౌంట‌ర్లు, ప్ర‌తి కౌంట‌ర్ల‌తో సోష‌ల్ మీడియా హోరెత్తిపోతోంది.

కిష‌న్ రెడ్డి త‌న ట్వీట్‌లో ‌పెట్రోల్ పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతం వ్యాట్‌ను తెలంగాణ స‌ర్కారు వ‌సూలు చేస్తోందని తెలిపారు. ఇలా 2014 నుంచి 2021 దాకా ఈ ప‌న్నుల‌తో తెలంగాణ స‌ర్కారు రూ.56,020 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింద‌ని కూడా ఆయ‌న తెలిపారు. 

ఈ ట్వీట్‌ను చూసిన వెంట‌నే ఓ టీఆర్ఎస్ మ‌ద్ద‌తు దారుడు... పెట్రోల్‌, డీజిల్‌ల‌పై తెలంగాణ వ‌సూలు చేస్తున్న వ్యాట్ వివ‌రాల‌తో పాటుగా కేంద్రం విధిస్తున్న ఎక్సైజ్ సుంకాల‌కు సంబంధించిన అంకెల‌ను పోస్ట్ చేశారు. 2014లో అమ‌లులో ఉన్న వ్యాట్ నే తెలంగాణ స‌ర్కారు ఇప్ప‌టికీ అమ‌లు చేస్తుంటే.. కేంద్రం మాత్రం 2014లో 9.40 శాతంగా ఉన్న ఎక్సైజ్ డ్యూటీని 2022 నాటికి ఏకంగా 27.9 శాతానికి పెంచింద‌ని వెల్ల‌డించారు. దీంతో ఇరు పార్టీల మ‌ద్ద‌తుదారుల మ‌ధ్య ట్వీట్ వార్ న‌డుస్తోంది.

More Telugu News