హైదరాబాదులో 'సర్కారు వారి పాట' ప్రీ రిలీజ్ ఈవెంట్... హాజరైన మహేశ్, కీర్తి

07-05-2022 Sat 20:48 | Both States
  • మహేశ్ బాబు హీరోగా సర్కారు వారి పాట
  • పరశురామ్ దర్శకత్వంలో చిత్రం
  • మే 12న సినిమా రిలీజ్
  • ఊపందుకున్న ప్రమోషన్ ఈవెంట్లు
Sarkaaru Vaari Pata Pre Release Event
మహేశ్ బాబు హీరోగా నటించిన 'సర్కారు వారి పాట' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హైదరాబాదులోని యూసుఫ్ గూడ పోలీస్ గ్రౌండ్ వేదికగా నిలిచింది. సర్కారు వారి పాట చిత్రం ఈ నెల 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే ప్రమోషన్ ఈవెంట్స్ ముమ్మరంగా జరుగుతున్నాయి. మహేశ్ బాబు కూడా ఇటీవలే కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లి తిరిగొచ్చారు. నేటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కు హీరోయిన్ కీర్తి సురేశ్, దర్శకుడు పరశురామ్ కూడా విచ్చేశారు. 

ప్రీ రిలీజ్ వేదికపై మహేశ్ బాబు సామాజిక సేవా కార్యక్రమాలను కూడా ప్రస్తావించారు. ఇప్పటివరకు మహేశ్ బాబు ఆర్థిక సహకారంతో 2,500కి పైగా చిన్నారులకు హృదయ సంబంధ శస్త్రచికిత్సలు నిర్వహించిన విషయం వెల్లడించగానే, ఈవెంట్ కు విచ్చేసిన ప్రతి ఒక్కరూ లేచి నిలబడి మహేశ్ బాబును అభినందించారు. మహేశ్ సేవా కార్యక్రమాల ప్రత్యేక ఏవీని కూడా స్టేజిపై ప్రదర్శించారు. కాగా, సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ కు దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి కూడా విచ్చేశారు.